పాక్ ఉత్తర కుమార ప్రగల్భాలు

పాక్ ఉత్తర కుమార ప్రగల్భాలు

భారత్ అసలు పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ చేయనేలేదట. జస్ట్ చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటోందట. ఇదీ దాయాది దేశం కారుకూతలు. భారత్ ను నేరుగా ఎదుర్కునే దమ్ములేక.. పరోక్షంగా ఉగ్రవాదుల్ని ఎగదోస్తున్న పాకిస్థాన్.. బహిరంగంగా మన దేశానికి హెచ్చరికలు జారీ చేసింది.
        
ఒకేరోజు పాక్ ప్రధాని, ఆదేశ త్రివిధ దళాధిపతులు భారత్ ను హెచ్చరించడం చర్చనీయాంశమైంది. పాక్ సైనికులు యుద్ధనిపుణులని. వాళ్లు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే భారతీయులు తరతరాలుగా కథలుగా చెప్పుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై మన సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలని చురకంటించింది.
         
అటు కశ్మీర్ పైనా పాకిస్థాన్ వివాదాస్పదంగా వ్యవహరించింది. కశ్మీర్లో సంక్షోభం తారాస్థాయికి చేరిందని, పరిస్థితి చేయిదాటక ముందే జోక్యం చేసుకోవాలని ఐరాసలో ఆ దేశ రాయబారి కోరారు. మరోవైపు నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతల్ని ప్రస్తావించారు. భారత సైనికుల మృతదేహాలు ఛిద్రం చేశామన్న వాదనలన్నీ కట్టుకథలన్నారు.
           
మరోవైపు పాక్ వైపు నుంచి మూకుమ్మడిగా హెచ్చరికలు రావడంతో.. ఏదో జరుగుతోందని మన వ్యూహకర్తలు అనుమానిస్తున్నారు. ఎందుకైనా మంచిదని ఐబీ, రా అలర్టయ్యాయి. ఉగ్రవాద కదలికలపైనా ఓ కన్నేశారు. దారి మళ్లించి మరో కుట్రకు తెర తీస్తారనే కోణంలోనూ అప్రమత్తత ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు