డీడ్ కొట్టు.. భూములు పట్టు

డీడ్ కొట్టు.. భూములు పట్టు

ఏపీ రాజధాని అమరావతిని విద్యాకేంద్రంగా చేయాలని ప్రభుత్వం శ్రమిస్తోంది. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించింది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు భూదందాకు తెరలేపారు. అగ్రిమెంట్లు చేసుకుంటే.. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని, కారుచౌకగా భూములు కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు.
           
విద్యాకేంద్రాల కోసం 50 లక్షల ప్రోత్సాహక ధరతో భూములివ్వాలని డిసైడ్ చేసిన సర్కారు.. సేల్ అగ్రిమెంట్ రూపంలో ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు సేల్ అగ్రిమెంట్లకు ఓకే అన్న సదరు విద్యాసంస్థలు.. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి సేల్ డీడ్స్ రూపంలో ఇవ్వాలని మొండికేస్తున్నాయి.
            
కొందరు అక్రమార్కులు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఈ మాయోపాయం చెవిన వేశారని తెలుస్తోంది. అటు యాజమాన్యాలు కూడా కొంత డబ్బు మిగులుతుదని కక్కుర్తి పనులు చేయాలని చూస్తున్నాయి. అయితే సీఆర్డీఏ మాత్రం సేల్ డీడ్స్ ప్రతిపాదనకు మోకాలడ్డుతోంది. సేల్ అగ్రిమెంట్స్ అయితేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని బల్లగుద్ది మరీ చెబుతోంది.
          
ఇప్పుడు ఈ విషయం సీఎం వద్దకు చేరినట్లు తెలుస్తోంది. సేల్ డీడ్ వద్దంటే.. అమరావతి గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటుందని కొందరు పనిగట్టుకుని సీఎం చెవిలో తెగ ఊదుతున్నారట. అయితే ఇక్కడ మరో ఆసక్తికర కోణం ఉంది. సేల్ డీడ్ తో పొందే భూములు బ్యాంకుల్లో తనఖాపెట్టే రుణాలు పొందొచ్చు. కానీ సేల్ అగ్రిమెంట్ భూములకు అలా కుదరదు. అందుకే అక్రమార్కులు అంత మొండి పట్టు పడుతున్నారనేది అధికారుల మాట.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు