మోడీ చెప్పిందేంటి.. చేసిందేంటి..

మోడీ చెప్పిందేంటి.. చేసిందేంటి..

ఇంకా యాభై రోజుల సమయం ఉంది. బ్యాంకుల ముందు హడావిడిగా క్యూలు కట్టొద్దు. ప్రశాంతంగా నగదు మార్పిడి చేసుకోండి. ఇదీ ఇప్పటిదాకా కేంద్రం తరపున ప్రధాని, ఆర్థిక మంత్రి జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ చెబుతూ వస్తున్న మాట. కానీ మన జనానికి భయం ఎక్కువ కాబట్టి.. ముందుగానే ఉన్న పాతనోట్లన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. కష్టమో, నష్టమో పడి పని అయిందనిపించారు. లేదంటే ఇప్పుడు చాలా ఇబ్బందిపడేవాళ్లు.

కేంద్రం ఇప్పుడు ఉన్నట్లుండి నగదు మార్పిడి బంద్ చేసింది. కేవలం అకౌంట్ హోల్డర్స్ కు మాత్రమే డిపాజిట్స్, విత్ డ్రాయల్స్ అంటోంది. అంటే కేంద్రం తాను చెప్పిన మాటను తానే తుంగలో తొక్కింది. నవంబర్ 8న నోట్ల రద్దుపై ప్రకటన చేసిన మోడీ.. నవంబర్ 24వరకు 4వేల వరకు నగదు మార్పిడి చేస్తామని, ఆ తర్వాత లిమిట్ పెంచుతామన్నారు. ఇప్పుడు చూస్తే లిమిట్ సంగతి దేవుడెరుగు.. అసలు ఎక్స్చేంజ్ బంద్ చేసేశారు.

నగదు మార్పిడిపై రోజుకో ఆదేశాలు వెలువరిస్తూ తీవ్ర గందరోగళం పెంచిన కేంద్రం.. అసలేం చేస్తోందో ఎవరికీ ఆర్థం కావడం లేదు. 50 రోజులు ఎందుకు గడువిచ్చింది. ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకు ఉఫసంహరించిది అనేది బేతాల ప్రశ్నగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుల్లో మరిన్ని భయాలు పెరిగిపోయాయి, కేంద్రం చెప్పేదానిపై నమ్మకం పోతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు