మోడీ, కేసీఆర్ ల మధ్య ఏంటా సీక్రెట్ డీల్?

మోడీ, కేసీఆర్ ల మధ్య ఏంటా సీక్రెట్ డీల్?

పెద్ద నోట్ల యవ్వారంలో పెద్దలంతా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం నుంచి ముందే ఇన్ఫర్మేషన్ అందడంతో ఆయన తన వద్ద ఉన్న నల్లధనమంతా చక్కబెట్టేశారని ఇప్పటికే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం పైనా కాస్త అటూఇటూగా అవే ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబులా కేసీఆర్ కు ముందుగా సమాచారం అందకపోవడంతో ఆయన తొలుత షాక్ తిన్నారని.. ఆ క్రమంలోనే అసంతృప్తి వ్యక్తంచేయడంతో మోడీ నుంచి పిలుపు అందుకున్నారని చెబతున్నారు. దీంతో ఢిల్లీ వెళ్లి తన నల్లధనానికి భరోసా సాధించకు వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ పై మండిపడ్డారు.  కేసీఆర్ ను అతిపెద్ద అవినీతిపరుడిగా ఆయన అభివర్ణించారు. ఆయన వద్ద ఎంత బ్లాక్ మనీ ఉందో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. నల్లధనాన్ని మార్చుకునే క్రమంలోనే ప్రధాని మోదీని కేసీఆర్ కలిశారని... మోదీ, కేసీఆర్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువస్తానని చెప్పిన మోదీ విఫలమయ్యారని... ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. కేసీఆర్ నల్లధనం త్వరలోనే వెల్లడవుతుందని చెప్పిన జీవన్ రెడ్డి అది ఎప్పుడు ఎలా అన్నది చెప్పలేదు. జీవన్ రెడ్డి గతంలోనూ కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా కేసీఆర్ ను విమర్శిందుకు మొహమాటపడుతున్నా జీవన్ మాత్రం దూకుడు చూపుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English