కేసీఆర్ కొత్తింట్లో బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్

కేసీఆర్ కొత్తింట్లో బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం బేగంపేటలో సిద్ధమవుతున్న కొత్త బంగళా సర్వాంగ సుందరంగా
ఉండడమే కాదు చిన్న చీమ కూడా లోపలికి పోవడానికి వీల్లేనంత భద్రతా ఏర్పాట్లతో ఉందట. బుల్లెట్లు, మందుపాతరలను తట్టుకునే ప్రత్యేకమైన అద్దాలను విరివిగా వాడారు. హాళ్లు, పడక గదులకే కాకుండా బాత్రూంలకు సైతం ఇలాంటి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే ఉపయోగించారు. దీంతో అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ స్థాయిలో కేసీఆర్ ఇంటిని అటాక్ ప్రూఫ్ గా మార్చారని తెలుస్తోంది.
   
ఈ కొత్తింట్లో కేసీఆర్ కోసం నిర్మించిన బాత్ రూమ్ ను బులెట్ ఫ్రూఫ్ గా తయారు చేశారు. ఎటువంటి బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో ఈ బాత్ రూం నిర్మితమైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ వినియోగించే రెండు పడక గదులను సైతం హై క్వాలిటీ గ్లాస్ తో ఫిట్ చేశారని తెలుస్తోంది.
   
అత్యాధునిక ఆయుధాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు. మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న భవంతిలో వెంటిలేటర్లు, కిటికీలు సహా అన్ని అద్దాలనూ కోట్ల రూపాయలు వెచ్చించి తెప్పించారు.  కిలోమీటరు దూరం నుంచి షూట్ చేయగలిగే రైఫిల్ షాట్లను కూడా ఇవి తట్టుకోగలవు. కనీసం 50 మంది భద్రతా సిబ్బంది అనునిత్యమూ భవంతిని పహారా కాస్తుంటారని, ఐఎస్ డబ్ల్యూ (ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్) సభ్యులు పర్యవేక్షిస్తుంటారని అధికారులు చెబుతున్నారు.
   
కేసీఆర్ ను కలిసేందుకు ఎవరైనా అక్కడకు వెళ్తే ఫోన్, వాచ్, పర్స్ వంటి అన్ని వస్తువులనూ సరెండర్ చేసి లోనికి వెళ్లాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు