ఆసీస్, భారత్ కలోనియల్ కజిన్స్

ఆసీస్, భారత్ కలోనియల్ కజిన్స్

ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్లో ప్రధాన ప్రత్యర్థులు. కానీ నిజ జీవితంలో ఈ రెండు దేశాల మధ్య అనాదిగా అవినాభావ సంబంధం ఉందట. ఆంత్రోపాలజిస్టుల పరిశోధనలో ఈ విషయం తేలింది. దాదాపు నాలుగ వేల ఏళ్ల కిందటే రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలున్నాయట.
         
ఆస్ట్రేలియాలో రెండు జాతులున్నాయి. ఒకటి అభివృద్ధి చెందిన జాతి కాగా.. మరొకటి ఆదివాసులు. ఆదివాసులు ఆస్త్రేలియా ఖండానికి తొలిసారిగా వెళ్లారు. కానీ అభివృద్ధి చెందిన వాళ్లు బ్రిటన్ నుంచి వచ్చినవాళ్లు. ఆదివాసీలకు భారత్ తో సంబంధాలున్నాయట.
          
ఆదివాసీలు ఒంటికి బూడిద రాసుకుంటారు. ఇది నాగసాధువులను తలపిస్తుంది. భారతీయ హిందువులకు, ఆసీస్ ఆదివాసీలకు సారూప్యతలున్నాయి. భారత్ నుంచే ఆస్త్రేలియాకు వలసలు జరిగాయి. ఆస్ట్రేలియాలో ఉన్నట్లుండి అడవికుక్క కనిపించడం కూడా ఇందుకు మంచి ఉదాహరణ అని చెబుతున్నారు.
              
నాలుగు దశాబ్దాల క్రితం ప్రముఖ డాన్సర్ పద్మాసుబ్రహ్మణ్యం ఆసీస్ వెళ్లే ముందు చంద్రశేఖర సరస్వతి ఆశీర్వంద తీసుకోగా.. అక్కడి శివతెగను దర్శించమన్నారట. శివ తెగను చూసిన పద్మా సుబ్రహ్మణ్యం.. వారికి మన భారతీయులకు పోలికలున్నాయని గుర్తించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు