ఎక్కడ చూసినా బ్లాక్ భూతమే

ఎక్కడ చూసినా బ్లాక్ భూతమే

తెలుగు రాష్ట్రాల్లో మొదట్నుంచీ ఊపులో ఉన్న రియల్ రంగానికి బ్లాక్ మనీయే ఆయువుపట్టు. హైదరాబాద్ లో ఎప్పట్నుంచో రియల్ బూమ్ ఉండగా.. ఇప్పుడు ఏపీ అమరావతిలో కూడా రియల్ ఎస్టేట్ ఆకాశానికి దూసుకెళ్తోంది. విశాఖ, విజయవాడలో స్థలాలు, బాగా ఖరీదైపోయాయి.
           
మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు భారీగా అంతరం ఉంటోంది. ఈ తేడాయే బ్లాక్ మనీగా మారుతోంది. ఇది ఏకంగా సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారి ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారింది.
          
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నగదు రూపంలో జరుగుతాయని అంచనా. రియల్ వ్యాపారులు ప్రభుత్వానికి, అటు వినియోగదారుడికి ఇద్దరికీ కుచ్చుటోపీ పెట్టి వాళ్లు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు.
           
ముఖ్యంగా రియల్ బ్లాక్ భూతాన్నే కేంద్రం టార్గెట్ చేసిందనే వాదనలున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కట్టలపాములన్నీ బయటికొస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ బ్లాక్ బస్టర్లు కమిషన్ వ్యాపారులకు వరంగా మారాయి. వాళ్లు బ్లాక్ ను వైట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు