టిడిపికి బిజెపినే దిక్కు

టిడిపికి బిజెపినే దిక్కు

భారతీయ జనతా పార్టీపైన మతతత్వ పార్టీ అనే ముద్ర వేసి, మైనార్టీలకు వ్యతిరేకి అని ఆ పార్టీని విమర్శించిన తెలుగుదేశం పార్టీ, అదే పార్టీతో 2014 ఎన్నికల్లో జత కట్టబోతున్నదంట. మైనార్టీల విషయంలో ఆ పార్టీ ఆలోచన మారితే, బిజెపితో కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ టిడిపి నేతలే బిజెపితో పొత్తు కోసం ఆశపడుతున్నారంటే, తెలంగాణలో బిజెపి బలాన్ని ఆ పార్టీ ఖచ్చితంగా అంచనా వేసినట్టే అనుకోవాలి. కాని అదే తెలంగాణలో, రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో బిజెపిని నమ్ముకుంటే కష్ట కాలం తప్పదని చంద్రబాబు భావిస్తున్నార్ట.

జాతీయ స్థాయిలో బిజెపికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వాటి ద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చునని ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారని వినికిడి. రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది. ఒకమారు బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకున్నది కూడాను. అదే ఇంకోసారి పునరావృతం అవడానికి 2014 ఎన్నికలు వేదికవుతాయేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English