2020కి కమలే కీ వర్డ్

2020కి కమలే కీ వర్డ్

అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కమలా హ్యారిస్ పేరే వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ కు ముకుతాడు వేసేది ఆమేనని అందరూ అనుకుంటున్నారు. సెనేట్లో డెమోక్రాట్లను లీడ్ చేసేది కూడా కమలే.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఉన్న కమలా హ్యారిస్.. శక్తివంతమైన మహిళా నేతగా ఉన్నారు. హ్యూమన్ రైట్స్ లాయరైన కమలా తన వాదనా పటిమతో ఎవరినైనా ఒప్పించే సత్తా ఉంది. అమెరికాలో శక్తివంతమైన రాష్ట్రం కాలిఫోర్నియా నుంచి కమలా సెనేటర్ గా కూడా ఉన్నారు.

హిల్లరీ అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలు కాకపోయినా.. కనీసం కమలా అయినా అవుతుందని డెమోక్రాట్లు అంచనా వేస్తున్నారు. కమలా హ్యారిస్ ను ప్రొజెక్ట్ చేస్తే 2020 నాటికి గట్టి అభ్యర్థి అవుతారని అంచనా వేస్తున్నారు. చూడటానికి అందంగా కనిపించే కమలా హ్యారిస్.. వాదన కూడా అంతే అందంగా చేస్తారు.

ట్రంప్ వలసదారులకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే కమలే కీలకం అవుతారని అంచనా. తన వాదనా పటిమతో ట్రంప్ విధానాలకు అడ్డుకట్ట వేస్తారని అందరూ భావిస్తున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు