మాల్యాకు రద్దుచేశారు.. నాకు చేయరా?

మాల్యాకు రద్దుచేశారు.. నాకు చేయరా?

సామాన్యుడి ఆగ్ర‌హం తారాస్థాయికి చేరితే ఎలా ఉంటుందో తాజాగా అదే జ‌రిగింది. పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు ఇచ్చిన రుణాన్ని మాఫీచేసిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి ఒక సఫాయి కార్మికుడు షాకిచ్చాడు. మాల్యాకు ఇచ్చిన రుణం రద్దు చేశారు. మరి తనకిచ్చిన రుణం సంగతేమిటని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సఫాయి కార్మికుడు బాబూరావు సొనావానే ప్రశ్నించాడు. మాల్యా రుణాన్ని రద్దుచేసినట్లే తనకు ఇచ్చిన రుణం కూడా రద్దుచేయాలని కోరుతూ ఎస్బీఐ శాఖ మేనేజర్‌కు సొనావానే లేఖ రాశాడు.

విజ‌య్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సహా వివిధ సంస్థలకు ఇచ్చిన రూ.7000 కోట్ల రుణం మాఫీచేస్తున్నట్లు ఎస్బీఐ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ''మాల్యాకిచ్చిన రుణం రద్దుచేస్తూ ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ బ్యాంకుకు నేను లేఖ రాశా. అలాగే నా రుణం రద్దుచేయాలని విజ్ఞప్తిచేశా'' అని సొనావానె పీటీఐకి తెలిపాడు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా తలెత్తిన ఖర్చుల కోసం తాను తీసుకున్న రూ.1.5 లక్షల రుణం మాఫీ చేయాలని బాబూరావు సొనావానె కోరాడు. తన లేఖకు బ్యాంక్ మేనేజర్ నుంచి ప్రతిస్పందన రాలేదని సొనావానె తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English