పెద్దనోట్లు.. పుట్టెడు ఉపాయాలు

పెద్దనోట్లు.. పుట్టెడు ఉపాయాలు

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదండీ. పెద్ద నోట్ల రద్దుతో.. డబ్బుండీ బికారులైన బడాబాబులు కొత్త ఐడియాలకు తెరతీస్తున్నారు. ఎప్పటిలాగే మరోసారి వీరికి బంగారం సేఫ్ ఆప్షన్ గా మారింది.

వెయ్యి, 500 నోట్ల రూపంలో ఎక్కువ బ్లాక్ మనీ ఉందని భావించిన కేంద్రానికి బడాబాబులే టార్గెట్ అయ్యారు. దీంతో పెద్ద మొత్తం బ్యాంకుల్లో జమ చేయలేని స్థితిలో ఉన్న వీళ్లు తెలిసిన వారి బంగారాన్ని పాత నోట్లతో విడిపిస్తూ.. ఆరునెలల తర్వాత వడ్డీలేకుండా అప్పు తీర్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా పెద్దమనుషులకు విలువుండే పల్లెటూళ్లలో ఇలాంటి సిత్రాలు చాలా జరుగుతున్నాయి. దీనికి తోడు లెక్కల్లో చూపని బంగారం బిస్కెట్లు కూడా ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు. అవసరమైతే ముందు జాగ్రత్త చర్యగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు కూడా తీసుకుంటున్నారు.

ఓవైపు నల్లదొరలు దర్జాగా బ్లాక్ ను వైట్ చేసుకుంటుంటే.. మరోవైపు సామాన్యులు మాత్రం రెండు వేల కోసం గంటల తరబడి బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు