బ్లాక్ కోసం బోగీనే బుక్ చేసిన అధికారి!

బ్లాక్ కోసం బోగీనే బుక్ చేసిన అధికారి!

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు బడాబాబులు కొందరు చేస్తున్న ఫీట్లు సర్కస్ విన్యాసాలను మించిపోతున్నాయి. తాజాగా ఓ అధికారి నోట్లు, నగలు తరలించేందుకు ఏకంగా రైలు బోగీనే బుక్ చేసుకోవడం సంచలనమైంది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఎస్‌కే పారి, చెన్నై ఐసీఎఫ్‌లో భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌ ఐజీ హోదాలో ఉన్న పారి తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా హౌరా వెళ్లే  రైలులో ప్రత్యేకంగా ఒక ఏసీ బోగీని రిజర్వ్‌ చేసుకున్నారు.

పారి ఏకంగా బోగీనే బుక్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవడమే కాక, ఏదో జరుగుతోందన్న సందేహాలు ముప్పిరిగొన్నాయి. పారి బుకింగ్ పై దృష్టి సారించిన కొందరు ఈ బోగీలో నల్లధనం, నగలను తరలిస్తున్నట్లు సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ఎనిమిది మంది అధికారుల బృందం చెన్నైలోని ఎగ్మూర్‌ స్టేషన్‌లో సిద్ధంగా ఉండి అక్కడికొచ్చిన హౌరా రైలులోని ప్రత్యేక బోగీని సీజ్‌ చేసి రైలును పంపించేశారు. బోగీలో పెద్ద మొత్తంలో నల్లధనం, నగలను అధికారులు గుర్తించినట్టు సమాచారం. అవన్నీ ఒకే వ్యక్తివా లేక, రైల్వే యంత్రాంగంలోని మరింతమంది ఉన్నతాధికారులవా? అనే కోణంలో సీబీఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు