జగన్ కు ఒళ్లంతా భయమేనట..

జగన్ కు ఒళ్లంతా భయమేనట..

వైసీపీ నేత జగన్ కు ఇటీవల కాలంలో భయం బాగా పెరిగిపోయిందట. ప్రతి విషయానికీ తెగ టెన్షన్ పడుతూ విపరీతంగా భయపడుతున్నారట. భద్రత విషయంలో ఊరికే ఆందోళన చెందుతున్నారట. అంతేకాదు... విజయవాడ పేరు చెబితే హడలిపోతున్నారట. ఆ కారణంగానే వైసీపీ ఆఫీసును విజయవాడలో ఏర్పాటు చేయడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఒక వేళ విజయవాడ వచ్చినా అక్కడ రాత్రి బస చేయడం లేదట. మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారట.

ఒక్క విజయవాడే కాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా ముందుగా ఒక చోట బస చేస్తానని చెప్పి అప్పటికప్పుడు వేరే ప్రాంతానికి మారుతున్నారు. ఆ మధ్య శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు ఇలాగే జరిగింది.  మరోవైపు విపక్ష నేత కావడంతో ప్రభుత్వం ఆయనకు గట్టి భద్రత కల్పించినప్పటికీ అది చాలదన్నట్లు భారీగా సొంత భద్రత ఏర్పరుచుకున్నారు.

ప్రస్తుతం జగన్ కు ప్రభుత్వ భద్రత, వ్యక్తిగత భద్రత కలిపి దాదాపుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నంత భద్రత ఉంది. జగన్ సొంతంగా 150 మంది బౌన్సర్లను నియమించుకున్నారంటే ఆయన భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతోంది.

జగన్ టెన్షన్... బౌన్సర్లను భారీగా నియమించుకుంటున్న తీరు చూస్తున్న ఆ పార్టీ నేతలు జగన్ ఎందుకో భయపడుతున్నారని అంటున్నారు. ఇది రాజకీయంగా వచ్చిన భయం కాదని... ప్రభుత్వాన్ని చూసి భయపడడం కాదని.. ఏదో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన భయపడుతున్నారని అంటున్నారు. మరి జగన్ కు అంతగా ప్రాణభయం కలిగిస్తున్న అంశమేమిటో ఆయనకే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English