నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నారట

నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నారట

దేశంలో నోట్ల ముద్రణ చాలా పరిమితంగా.. ఒక క్రమపద్ధతిలో జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లను రద్దు చేయటం.. వాటి స్థానంలో కొత్తనోట్లను చెలామణిలోకి తీసుకురావాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం అందుకు తగ్గట్లుగా గ్రౌండ్ వర్క్ గడిచిన కొన్ని నెలలుగా చేస్తూనే ఉంది. నాడు.. గుట్టుగా.. రహస్య ఆపరేషన్ తరహాలో కొత్త నోట్ల ముద్రణ సాగితే.. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మోడీ అధికారిక ప్రకటన తర్వాత నుంచి పరిస్థితులు మొత్తంగా మారిపోయినట్లుగా తెలుస్తోంది.

పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత.. దేశ వ్యాప్తంగా బ్యాంకులకు పెద్ద నోట్లు పోటెత్తటం.. వాటి స్థానంలో కొత్త కరెన్సీని ప్రజలకు ఇస్తున్న నేపథ్యంలో.. బ్యాంకుల చేతికి వస్తున్న నోట్లకు ప్రతిగా కొత్త నోట్లను ఇవ్వాల్సి రావటం.. ఈ డిమాండ్ భారీగా ఉండటంతో నోట్లను ముద్రించే మింట్ లు ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయినట్లు తెలుస్తున్నాయి.

మామూలు రోజుల్లో అయితే.. మింట్ లో కొత్త నోట్ల ముద్రణ పరిమిత కాలంలో మాత్రమే జరుగుతుందని చెబుతున్నారు. తాజాగా మారిన పరిస్థితుల దృష్ట్యా.. నాన్ స్టాప్ గా నోట్ల ముద్రిస్తున్నట్లుగా తెలుస్తోంది. 24/7  అన్న చందంగా కొత్త నోట్ల ముద్రణలో మింట్ ఉద్యోగులు పని చేస్తున్నారని.. కొత్త నోట్లను భారీ ఎత్తున ముద్రిస్తున్నట్లుగా సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు