పెద్ద నోట్లు.. ఈ సూచనేదో బాగుందే

పెద్ద నోట్లు.. ఈ సూచనేదో బాగుందే

కట్టలు కట్టలుగా ఉన్న పెద్ద నోట్లను ఏం చేయాలి... ఇప్పుడు కోట్లాది మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ నోట్లను తమ అనుచరుల ద్వారా.. తెలిసిన వాళ్ల ద్వారా మార్పిడి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నల్ల కుబేరులు. అయినప్పటికీ తమ దగ్గరున్న మొత్తం డబ్బును మార్పిడి చేయడం అసాధ్యం లాగే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వందలు.. వేల కోట్లు వృథా అయిపోతాయేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మార్పిడి కోసం ప్రయత్నాలు చేసి.. చివరికి గడువు దాటిపోయాక ఏమీ చేయలేక ఆ నోట్లను వృథాగా పడేస్తారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కొంచెం పెద్ద మనసు చేసుకుంటే చాలామందికి సాయపడ్డ వాళ్లవుతారు నల్ల కుబేరులు
తమ దగ్గరున్న నోట్ల కట్టలతో ఎలా మేలు చేసి.. మంచి పేరు సంపాదించవచ్చో చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని సూచనలతో మెసేజ్‌లు హల్ చల్ చేస్తున్నాయి ప్రస్తుతం. అందుతో ముందు కనిపిస్తున్న సూచన.. ఆసుపత్రుల వద్దకు వెళ్లి డబ్బు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడం. అలాగే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటు అందించడం.. తమ దగ్గర పని చేసే వాళ్లకు లక్ష.. రెండు లక్షలు ఇలా పంచి పెట్టి వాళ్లు మరింత విశ్వాసంతో పని చేసేలా చేయడం.. పెళ్లి కావాల్సిన ఆడ పిల్లల కుటుంబాలకు.. రైతులకు సాయం చేసి.. ఆపద్బాంధవుడు అనిపించుకోవడం.. ఇలాంటి సూచనలతో వాట్సాప్ మెసేజ్‌లు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. మరి నల్ల కుబేరులు ఈ దిశగా ఆలోచిస్తే చాలామందికి మంచి జరుగుతుంది. కానీ ఆ నోట్లను సాధ్యమైనంత వరకు మార్పిడి చేయించుకోవడానికే చివరిదాకా ప్రయత్నించి.. ఆ తర్వాత ఈ దిశగా ఆలోచిస్తారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు