పబ్లిక్ గా నీలిచిత్రాలు చూస్తూ బుక్కైపోయిన మంత్రి

పబ్లిక్ గా నీలిచిత్రాలు చూస్తూ బుక్కైపోయిన మంత్రి

కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్‌ కాంగ్రెస్ సర్కాస్ కు తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. మొబైల్‌ ఫోన్‌ లో అశ్లీల చిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డారు. గురువారం రాయచూరలో నిర్వహించిన టిప్పు జయంతి కార్యక్రమంలో ఆయన ఈ ఘనకార్యం చేశారు. ఈ విషయం అన్ని వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆయన నీలి చిత్రాలు చూస్తున్న సంగతిని ఓ టీవీ ఛానల్ స్పష్టంగా చిత్రీకరించింది. ఇదే విషయమై ఎదురైన ప్రశ్నలకు తన్వీర్ పొంతనలేని వివరణలు ఇచ్చారు. మైసూరులో సాగుతున్న టిప్పు ఉత్సవాల స్టేటస్ ను తెలుసుకునేందుకు బ్రౌజ్ చేస్తున్నానని, ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా వచ్చిన ఫొటోలు కొన్ని స్క్రీన్ పైకి వచ్చాయని చెప్పారు. తాను వేడుకల సమాచారాన్ని తెలుసుకునేందుకే యత్నించానని బుకాయించారు.

వేదికపై ఆయన పక్కనే కూర్చుకున్న రాయచూర్ ఎంపీ బీవీ నాయక్ కూడా తన్వీర్ ను వెనకేసుకొచ్చారు. మైసూరుతో పాటూ ఇతర జిల్లాల్లో టిప్పు జయంతోత్సవాల సమాచారాన్నే ఆయన తనకు చూపించారని చెప్పారు. తన్వీర్ మొబైల్ లో టిప్పుకు ఉత్సవాలకు సంబంధించి వందలాది మేసేజ్ లు ఉన్నాయని, ఆయన కేవలం వాటిని స్క్రోల్ చేస్తున్నారని అన్నారు. "మా వెనక కెమేరాలు ఉన్న సంగతి తెలుసు. మేము టిప్పు జయంతికి సంబంధించిన ఫొటోలు మాత్రమే చూశాం. నేను తన్వీర్ వెంట 90 నిమిషాలు ఉన్నా. ఆయన ఎలాంటి అశ్లీల చిత్రాలు చూడలేదు" అని నాయక్ స్పష్టం చేశారు. తన్వీర్ ను వెనకేసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నా విపక్షం బీజేపీ నేతలు మాత్రం మండిపడుతున్నారు. తన్వీర్ మంత్రిగా కొనసాగే నైతికతను కోల్పోయారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

2012లోనూ కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే సంభవించింది. అప్పటి అధికార బీజేపీ నేతలు లక్ష్మణ్ సవాడి, సీసీ పాటిల్ లు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారు. ఈ అంశంపై దుమారం చెలరేగడంతో వారు పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014లో ఓ బీజేపీకే చెందిన మరో నాయకుడు ప్రభు చవాన్ ప్రియాంక గాంధీ ఫొటోను మొబైల్ లో జూమ్ చేయడం పార్టీని ఇరకాటంలో పడేసింది. అదే ఏడాదిలో యూబీ బనకర్ క్యాండీ క్రష్ ఆడడం పతాకశీర్షికైంది. తాజా ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ తన్వీర్ చర్యపై నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తానని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English