ట్రంప్ మంచి అధ్యక్షుడు కాలేరా?

ట్రంప్ మంచి అధ్యక్షుడు కాలేరా?

శుభమా అని ఆయన అధ్యక్షుడైతే ఇవేం అపశకునం మాటలు అనుకుంటున్నారా. కానీ, తప్పదు. చరిత్ర చెప్పిన సత్యాలను ఇలాంటి సందర్భంలో కాకపోతే ఇంకెప్పుడు మననం చేసుకుంటాం. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి.. కొండను ఢీకొట్టి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అందుకున్న ట్రంప్ ది నిర్ద్వంద్వంగా గొప్ప విజయమే. ఇంత గొప్ప విజయం సాధించిన ఆయన అధ్యక్షుడిగా సక్సెస్ కాలేరా అంటే సందేహించాల్సిందే. ఆయన గొప్ప అధ్యక్షుడిగా నిరూపించుకుంటే మాత్రం చరిత్రను తిరగరాసినట్లే. కారణం... గొప్ప వ్యాపారవేత్తలుగా ఉంటూ అమెరికా అధ్యక్షులైనవారెవరూ ప్రెసిడెంట్ గా సక్సెస్ కాలేదు. అమెరికన్ వరస్ట్ ప్రెసిడెంట్స్ లిస్టుల్లో టాప్ లో ఉన్నారే కానీ.. బెస్టు ప్రెసిడెంట్స్ లిస్టుల్లో చోటు సంపాదించుకోలేకపోయారు. ఇప్పుడు ట్రంప్ కూడా బిజినెస్ మేన్ కావడంతో ఆయన చరిత్రను నిజం చేస్తారా తిరగరాస్తారా అన్నది చూడాలి.

అమెరికా అధ్యక్షుల్లో ఆల్ టైం గ్రేట్ ఎవరంటే అయిదారు పేర్లు వినిపిస్తాయి. జఫర్సన్, లింకన్, రూజ్ వెల్ట్, విల్సన్, ట్రూమన్ ఇలా కొన్ని పేర్లు చెబుతారు. 1900 తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వారిలో జార్జి బుష్, వారన్ హార్డింగ్, బుచానన్, ఆండ్రూ జాన్సన్ వంటివారంతా వ్యాపారవేత్తలే. అయితే.. వివిధ కారణాల వల్ల జనం వారిని గొప్ప నేతలుగా గుర్తించలేదు.

హూవర్, కూలిడ్జ్, బుస్, హార్డింగ్ వంటివారూ విఫల అధ్యక్షులే. వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అన్నంతగా విజయాలు సాధించిన హార్డింగ్ అధ్యక్షుడిగా మాత్రం అట్టర్ ప్లాఫ్. అమెరికాలోని వరస్ట్ ప్రెసిడెంట్లలో ఆయనొకరుగా పేరు తెచ్చుకున్నారు.

అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసినవారిలో ఇంతవరకు 21 మంది లాయర్లు, 8 మంది జనరల్స్, మరికొందరు ఇంజినీర్లు, ప్రొఫెసర్లు, ఒకరు నటుడు, మిగిలినవారు వ్యాపారవేత్తలు ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్షులిగా పనిచేసినవారిలో ఆండ్రూ జాన్సన్ వస్త్రవ్యాపారం, హార్డింగ్ మీడియా వ్యాపారం, హూవర్ మైనింగ్, జిమ్మీకార్టర్ వ్యవసాయరంగంలో వ్యాపారాలు చేయగా జార్జిబుష్ సీనియర్ ది చమురు వ్యాపారం. వీరంతా తమతమ రంగాల్లో తిరుగులని వ్యాపారవేత్తలుగా నిరూపించుకున్నారు. అయితే... వీరితో పాటు మరో అమెరికా అధ్యక్షుడు కూడా వ్యాపారవేత్తగా ప్రసిద్ధుడే. ఆయన ట్రూమన్. అయితే... వ్యాపారంలో ఆయన తీవ్ర నష్టాలు చవి చూశారు. ఫెయిల్యూర్ బిజినెస్ మన్ అన్న పేరుంది. ఆయన మాత్రం అధ్యక్షుడిగా బాగా రాణించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సృష్టించి గొప్ప అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు.

అయితే.. ట్రంప్ విషయానికొస్తే ఆయన గొప్ప వ్యాపారవేత్తే అయినా నష్టాలు చవిచూసిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఆయన పెర్మార్మెన్సు ఎలా ఉంటుందో ముందుముందు చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు