సమస్యల సుడిగుండంలో సామాన్యుడు

సమస్యల సుడిగుండంలో సామాన్యుడు

 డబ్బులున్నా అవి చిత్తుకాగితాలే. మార్చుకోవడానికి పాత నోట్లున్నా.. మార్చుకునే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితుల్లో కూడా డబ్బు లావాదేవీలు జరగని పరిస్థితి. నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకున్న హఠాత్ నిర్ణయం.. సామాన్యుడి జీవితాన్ని స్తంభింపజేసింది.

 కేంద్రం మూడు రోజుల పాటు ఎన్నో వెసులుబాట్లు ఇచ్చింది. కానీ ఆచరణలో అవేవీ కనిపించడం లేదు. పెట్రోల్ బంకుల్లో మూడు రోజుల పాటు పాత నోట్లు చెల్లుతాయన్నారు. కానీ ఏ బంక్ లోనూ పాత నోట్లు తీసుకోవడం లేదు. కనీసం మంగళవారం అర్థరాత్రి వరకైనా ఏటీఎమ్ లు పనిచేస్తాయనుకున్నారు. కానీ ప్రధాని ప్రెస్ మీట్ ముగిసిన మరుక్షణమే అన్నీ బంద్ అయ్యాయి.
ప్రభుత్వ సంస్థలు కూడా ప్రైవేట్ సెక్టార్ మాదిరిగా సామాన్యుడి అవసరాలతో ఆడుకుంటున్నాయి. మెట్రో నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాత నోట్లు తీసుకుంటారనుకోవడం అత్యాశే అవుతుంది. అతిపెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు రోజులు బ్యాంకులు పనిచేయవని చెప్పడంతోనే.. కేంద్రం సరైన కసరత్తు చేయలేదని స్పష్టమౌతోంది.
ఈపాటికే అన్ని బ్యాంకులకు కొత్త నోట్లు ఆర్బీఐ సప్లై చేసి ఉండాలి. ఆ తర్వాతే నిర్ణయం ప్రకటించాలి. కానీ అక్రమార్కులకు చేతులు, కాళ్లు కట్టేయాలనే ఆత్రంతో.. సామాన్యుడి నోట్లో కూడా కేంద్రం మట్టి కొట్టిందన్న విషయం చాలామందికి ఆలస్యంగా అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు