కేబినెట్ కు కూడా తెలియదా?

కేబినెట్ కు కూడా తెలియదా?

సంచలనం సృష్టించిన మోడీ నిర్ణయం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలియదని చెబుతున్నారు. నోట్ల రద్దు గురించి ముందుగానే పక్కా ప్లాన్ వేసుకున్న మోడీ ఆ విషయాన్ని కొద్దిమంది అతి ముఖ్యులకు మాత్రమే చెప్పారట. కొత్త నోట్లను రహస్యంగా ముద్రించడం..  నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు వంటివన్నీ కొద్దిమంది నేతలకే తెలుసట. ప్రధాని, ఆర్థికమంత్రి, ఆర్బీఐలోని అతికొద్ది మంది ప్రముఖులకు తప్ప ఎవరికీ తెలియదు. చాలా మంది కేంద్ర మంత్రులకు కూడా విషయం తెలియదంటే, విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచారో అర్ధం చేసుకోవచ్చు.

నోట్ల రద్దు విషయాన్ని పకడ్బందీగా వెల్లడించాలన్న ఉద్దేశంతోనే సమాచారాన్ని రహస్యంగా ఉంచామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పడంతో దీని వెనుక ఇంత ప్లాన్ ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పటికే ముద్రణ పూర్తయి చాలా బ్యాంకులకు నోట్లు వచ్చేశాయట.

మరోవైపు నిజంగానే అంత రహస్యంగా ఉంచారా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రుల్లో కొందరు కీలకమైన వారు తమ ముఖ్య స్నేహితులైన వ్యాపారవేత్తలకు, మీడియా కింగ్ లకు చెప్పారని... వారంతా ముందే జాగ్రత్తపడి ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు