కరెన్సీ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఇది చదవండి

కరెన్సీ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఇది చదవండి

- 500, 1000 నోట్ల రద్దు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు

- మార్చుకోవటానికి గడువు డిసెంబరు 30

- కొత్తగా రూ.500, రూ.2,000ల నోట్లు

– ఏదైనా కారణాలవల్ల రూ. 1,000, రూ, 500 నోట్లను డిపాజిట్‌ చెయ్యలేకపోయినవారు తగిన గుర్తింపు ఆధారాన్ని చూపించి 2017 మార్చి 31 వరకూ ఆ నోట్లు మార్చుకోవచ్చు. దీనికోసం డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

– నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 30వ తేదీలోగా ప్రజలు రూ. 500, రూ. 1,000 నోట్లను తమ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు, పోస్టాఫీసుల్లో మార్చు కోవచ్చు. దీనికోసం ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌, వోటర్‌ ఐడి లాంటి చెల్లు బాటయ్యే గుర్తింపు ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

– ఇకపై రూ. 500, రూ. 1,000 నోట్లు ఇకపై కాగితం ముక్కలే, వాటికి విలువ లేదు.

– అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రభుత్వాసుపత్రుల విషయంలో కొన్ని మినహాయింపులుంటాయి. రూ. 500, రూ. 1,000 నోట్లను కలిగి ఉన్న ప్రయాణికులకు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో న్యాయబద్ధమైన టెండర్స్‌తో వాటిని మార్పిడి చేసుకొనే ఏర్పాట్లు చేస్తాం.

– రద్దయిన నోట్లను డిపాజిట్‌ చేసిన తర్వాత, ఆ మొత్తంలోంచీ రోజువారీ నగదు విత్‌ డ్రా పరిమితి రూ. 10 వేలు, వారానికి ఈ పరిమితి రూ. 20వేలు మాత్రమే

– ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, నగదు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ లావాదేవీలపై ఆంక్షలేవీ లేవు.

– ఎటిఎంలు నవంబర్‌ 9 వరకూ, కొన్ని ప్రాంతాల్లో నవంబర్‌ 10 వరకూ పని చెయ్యవు.

– ప్రభుత్వాసుపత్రులు, ఆసుపత్రులవద్ద ఉన్న మందుల దుకాణాల్లో నవంబర్‌ 8వతేదీ అర్థరాత్రి నుంచి 72 గంటలవరకూ రూ. 500, రూ. 1,000 నోట్లను ఆమోదిస్తారు.

– ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో నవంబర్‌ 24లోగా మార్పిడి చేసుకొనే పరిమితి రూ. 4 వేలు మాత్రమే. ఆ తర్వాత ఈ పరిమితిపై సమీక్షిస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు