ట్రంపుతో కంపు తప్పదా..?

ట్రంపుతో కంపు తప్పదా..?

ట్రంపు వస్తే ప్రపంచమంతా కంపు కొట్టడం ఖాయమని మీడియా కోడై కూస్తోంది. ఓ రకంగా ట్రంప్ ను అధ్యక్షుడు కాకుండా చేయడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది. ట్రంప్ వాచాలత్వాన్ని పక్కనపెడితే.. మీడియా ఆయనకు వ్యతిరేకంగా ఉందన్న మాట ముమ్మాటికీ నిజం. అసలంతగా అందరూ ట్రంపును వ్యతిరేకించడానికి చాలా గట్టి కారణాలే ఉన్నాయ్.

ప్రపంచంలో ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యానికే పెద్దపీట. గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. కానీ ట్రంప్ ఆలోచనలు కాలం చెల్లినవి. అమెరికాకు, మెక్సికో మధ్య గోడ కట్టడం మధ్యయుగాల ఆలోచన. పైగా చైనా వస్తువులపై ఎక్కువ పన్ను విధిస్తామంటున్న ట్రంప్.. అమెరికా వస్తువులపై చైనా పన్ను విధిస్తే పరిస్థితేంటని ఆలోచించడం లేదు.

స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ దూకుడుగా ఉంటున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల పర్యవసానాలు ఊహించలేకపోతున్నారు. అమెరికాలో వలసదారులై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. వారు ఆగ్రహిస్తే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలుతుందని గ్రహించలేకపోతున్నారు. మరోవైపు న్యాయమూర్తుల్ని కూడా ట్రంప్ బెదిరిస్తున్నారు.

ట్రంప్ ఆలోచనలు, వ్యవహారశైలి కారణంగా.. ఆయన అధ్యక్షుడైతే ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ముందు అమెరికాని, తర్వాత దాని మిత్రదేశాల్ని, ఫైనల్ గా అన్ని దేశాల్నీ ముంచుతుందనీ హెచ్చరిస్తున్నారు. అందుకే ట్రంప్ అంటే మీడియా ఆమడ దూరం పరిగెడుతోంది. ట్రంప్ అధ్యక్షుడు కాకూడదని ఎన్నారైలతో పాటు అందరూ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు