టీడీపీకి అడ్డంగా దొరికిపోయిన జ‌గ‌న్‌

టీడీపీకి అడ్డంగా దొరికిపోయిన జ‌గ‌న్‌

జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ పేరుతో విశాఖ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోసం గ‌ళం విప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. టీడీపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతు ఆయ‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని తేల్చేశారు. ప్రత్యేక హోదా పేరెత్తితే పీడీ యాక్టు పెడుతారని నిందిస్తున్న వైసీపీ అధినేత‌ జగన్ మోహన్ రెడ్డి  ఇప్పటి వరకు ఎంత మంది పై పీడీయాక్టు నమోదు చేయబడిందో ప్రజలకు సమాధానం చెప్పాలని గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్ర‌బాబుపై టాడా కేసు పెట్టాలంటున్న ప్రతిపక్ష నాయకుడికి టాడా అమలులో లేదన్న వాస్తవం కూడా తెలియకపోవడం దారుణమ‌ని గాలి పేర్కొన్నారు. టాడా అనేది టెర్రరిస్తులపైన పెట్టే కేసైతే, ముఖ్యమంత్రిపై పెట్టాలంటున్నారంటే సీఎం ఏమైనా దేశద్రోహం చేశారా అని నిల‌దీశారు. ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్యోగులను కొట్టి, హైదరాబాద్ అసెంబ్లీలో తుపాకీ పేల్చిన చరిత్ర తండ్రిదయితే, హత్యలకు పాల్పడిన చరిత్ర తాత‌ద‌ని గాలి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ అప్పు- కరువు- మద్య ఆంధ్రప్రదేశ్ వ‌లే మారిపోయిందని జగన్ అనడం హాస్యాస్పదమ‌ని గాలి ముద్దుకృష్ణ‌మ విమ‌ర్శించారు. "అవినీతి, కరువు,మ‌ద్య‌పానం, ప్రజాధనం దుర్వినియోగం నీ తండ్రి ఘనతలు కావా? హైదరాబాద్ దాటివెళ్లాలంటే కోర్డు అనుమతులు తీసుకోవాల్సిన, ఈడీ కోర్టు చుటూ తిరగాల్సిన పరిస్థితి మీది. హెరిటేజ్ పైన బురద చల్లాలనుకోవడం వైకాపా నాయకుని అవివేకం. చంద్రబాబు హెరిటేజ్‌ను అధికారంలో ఉండగా ప్రారంభించలేదని గుర్తుంచుకోవాలి. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో, జ‌గ‌న్‌ తండ్రి ఎంపీగా ఉండగా ప్రైవేటు డైరీలకు ప్రవేశం కల్పించిన సందర్భంలో హెరిటేజ్‌ ప్రారంభించబడిందని ప్రజలకు తెలుసు. దానికి కోసం ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కానీ, ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ముగానీ ఉపయోగించుకున్నది లేదు. అన్ని ప్రైవేటు డైరీలు బాగా నడుస్తున్నట్టే హెరిటేజ్ కూడా నిబద్దతతో ప్రగతి పథంలో నడుస్తోంది.
ప్రభుత్వ డైరీలు దెబ్బతినడానికి హెరిటేజ్ కారణం కాదని మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కమిటీలే నివేదికలు ఇచ్చాయి. డైరీ రంగాన్ని ప్రైవేటుకు అప్పగించింది మీరే" అంటూ దుమ్మెత్తిపోశారు.

వైఎస్ జ‌గ‌న్‌కు చెందిన భారతీ షేర్ల‌ను ఏ విధంగా ప్రభావితం చేసుకున్నారో రాజా ఆఫ్ కరపన్ పుస్తకంలో అవినీతి ఖాతాల మీ అకౌంట్ నెంబర్లతో సహా ప్రచురించామ‌ని గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు చెప్పారు. అసెంబ్లీలో దీనిపై 4 గంటలపాటు చంద్రబాబు మాట్లాడితే వైఎస్ కనీసం ఖండించలేకపోయారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చేసేస్తే సరిపోతుందనుకోవడం పొరపాట‌ని, ఆధారాలు చూపెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుందని వైకాపా గుర్తుంచుకోవాలన్నారు. జగన్ జైల్లో ఉండగా ముందు నెలలో బెయిల్‌కు నిరాకరించిన సీబీఐ, మరుసటి నెలలో తెలంగాణ బిల్లు వచ్చే నాటికి విచారణ ముగిసిపోయినట్టు మాట్లాడటం వెనక సోనియాతో వైఎస్ విజయలక్ష్మి మంతనాలు, లాలూచీలు కారణమని ప్రజలందరికీ తెలుసున‌ని గాలి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English