కేసీఆర్ కుటుంబానికి ఈ సవాల్‌

కేసీఆర్ కుటుంబానికి ఈ సవాల్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దేప‌దే చెప్పే బంగారు తెలంగాణ పదాన్ని సీపీఎం తెలంగాణ క‌మిటీ కార్య‌ద‌ర్శి త‌మ్మినేని సీతారం ఎద్దేవా చేశారు. స్వ‌రాష్ట్ర పాల‌న అంటే ప్ర‌జ‌లు ఆశించిన విధంగా ఏమీ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న‌ బంగారు తెలంగాణా అంటే ఏమిటని ప్ర‌శ్నించిన త‌మ్మినేని తెలంగాణ‌లో ఎవ‌రూ బంగారం కావాలని అడగడం లేదని ఎద్దేవా చేశారు. త‌మకు డబల్ బెడ్ రూమ్ కావాలని, ఫించన్, విద్య, వైద్యం బ్రతుకు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఇవేవీ నెర‌వేర్చ‌ని తెలంగాణ బంగారు తెలంగాణ ఎలా అవుతుంద‌ని త‌మ్మినేని నిల‌దీశారు.

మ‌హాజ‌న పాద‌యాత్రలో ప్ర‌జ‌ల‌తో క‌లుస్తున్న త‌మ్మినేని ఈ సంద‌ర్భంగా కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ స‌ర్కారుపై సంద‌ర్భానుసారం ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పంచాయితీ బోర్డు ఎన్నిక అయినా వారు ఒక్క లైట్ వేయడానికి ఇబ్బంది పడుతున్నారని, గ్రామ పంచాయితీలకు నిధులు లేని ప‌రిస్థితి ఉంద‌న్నారు సీఎం కేసీఆర్ కేజి నుండి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు కాని అమలుకు నోచుకోవ‌డం లేదని త‌మ్మినేని తెలిపారు. పంటలు కూడ పూర్తి గా ఎండిపోయాయని, చాలా చోట్ల చెరువులు నిండలేదని చెప్పారు.  విద్య,వైద్యం పూర్తి గా ఉచితంగా అందించాలని మహాజన పాదయాత్ర డిమాండ్ చేస్తుందని త‌మ్మినేని అన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవితా, హరీష్ రావులకు మహాజన  పాదయాత్ర సవాలు చేస్తుందని ప్ర‌జ‌లు సంబ‌ర‌ప‌డే రీతిలో డబుల్ బెడ్ రూమ్ లు కాని దళితులకు 3 ఎకరాలు పంచినట్లు నిరూపణ చేయాలని స‌వాల్ విసిరారు. ప్ర‌భుత్వానికి మిగిలి ఉన్న రెండు సంవత్సరాలు పద్ధతి మార్చుకొని పాలన సాగించాలని కోరారు.

కొత్త రూపంలో దొరల పాలనా వచ్చిందని, స‌మాజంలో ఉన్న అత్యధిక కూలలను అణుచుతున్నార‌ని త‌మ్మినేని ఆరోపించారు. సామాజిక న్యాయం పాలనా ఉండాలని మహాజన పాదయాత్ర కోరుతుందన్నారు. స‌మస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జనాబాలో 93 శాతం ఉండి ఆవకాశాల్లో ఆదమంగా ఉండటం, అగ్రకులాల కుట్రలేనన్నారు. రచ్చబండ మీద దేవాలయాల్లోకి ప్రవేశం లేకపోవడం, కనీసం మనుషులుగా కూడా గుర్తించే పరిస్థితి లేదని త‌మ్మినేని వ్యాఖ్యానించారు. వీటన్నింటికీ ఉత్పత్తి శక్తులు కొందరి దగ్గరే కేంద్రీకృతం కావడం వల్ల హెచ్చు తగ్గులూ ఉన్నాయని, ఇలా కాకుండా జనాభా దామషా ప్రకారం ఎవరు ఎంత జనాభా ఉంటారో, వారు అంతా ఫలితాలు అనుభవించాలని ఆయన అన్నారు.  ఎన్ కౌంటర్ లేని ప్రజాస్వామ్య పాలనా కావాలని మహాజన పాదయాత్ర కోరుకుంటుందని తెలిపారు. సమస్యల పై లేఖలి వ్రాస్తున్నామ‌ని,  దండంపెడుతున్నామని చెప్పిన త‌మ్మినేని..సమస్యలను పరిష్కారం చేయకుంటే దండం తీసుకొనేది కూడ తెలుసున‌ని హెచ్చ‌రించారు.