యువరాజ్ హాజెల్ కీచ్ మ్యారేజ్ లీగ్

యువరాజ్ హాజెల్ కీచ్ మ్యారేజ్ లీగ్

ఐపీఎల్ తెలుసు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కూడా తెలుసు. కానీ ఈ యువరాజ్ హాజెల్ కీచ్ ప్రీమియర్ లీగ్ ఏంటి అనుకుంటున్నారా. ఏం లేదండీ.. ఇది మన యువీ, ప్రియురాలు హాజెల్ కీచ్ పెళ్లి సందడి. అందరి పెళ్లిలా కాకుండా మారథాన్ ను తలపించేలా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అందుకే  లీగ్ అని పేరు పెట్టుకున్నారు. యువరాజ్ హాజెల్ ప్రీమియర్ లీగ్ పేరుతో పెళ్లి పత్రిక కూడా ముద్రించారు.

నిజంగానే యువరాజ్, హాజెల్ పెళ్లి తతంగం ఐపీఎల్ ను తలపించనుంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమపక్షులు.. బాలిలో గత డిసెంబర్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కుటుంబం కోసం ఓసారి, సన్నిహితుల కోసం మరోసారి వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు.

యువరాజ్ ఫ్యామిలీ చండీగఢ్, ఢిల్లీకి చెందిన సిక్కు ఫ్యామిలీ . అందుకే నవంబర్ 30న చండీగఢ్ గురుద్వారాలో యువరాజ్, హాజెల్ పెళ్లి జరుగుతుంది. ఇక హాజెల్ బ్రిటిషర్ అయినా.. తల్లి హిందూ కాబట్టి.. డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయబద్ధంగా మరోసారి పెళ్లి జరుగుతుంది.

యువరాజ్ కు జల్సా పురుషుడిగా పేరుంది. అందుకు తగ్గట్టుగానే తన ఫామ్ హౌస్ లో సంగీత్ సెర్మనీ ధూమ్ ధామ్ గా జరగనుంది. ఐపీఎల్ పైనల్ తరహాలో ఆఖరి తతంగం.. రిసెప్షన్ ఢిల్లీలో 5 లేదా 7వ తేదీల్లో గ్రాండ్ గా చేయబోతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English