బ్రాండే కాదు.. బిజినెస్ కూడా..

బ్రాండే కాదు.. బిజినెస్ కూడా..

నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి పేరు మార్మోగిపోతోంది. 19 నెలల క్రితం ఏపీ సర్కారు తమ రాజధానికి అమరావతి అని పేరు పెట్టినట్లు ప్రకటించగానే.. అమరావతి అనే పేరుకు బ్రాండింగ్ వచ్చేసింది. అప్పట్నుంచి అమరావతి అంటే అందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మాణం కూడా పూర్తికావడంతో.. అటు బిజినెస్ సర్కిల్స్ లో కూడా అమరావతికి క్రేజ్ వచ్చేసింది.

విజయవాడ, గుంటూరులో గత రెండు నెలల్లోనే దాదాపు 200 వ్యాపారాలకు అమరావతి పేరు పెట్టారంటే బ్రాండింగ్ ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హోటళ్లు, కర్రీ పాయింట్లు, అకాడెమీలు, స్కూళ్లు, కాలేజీలు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, రియల్ ఎస్టేట్. .ఇలా  ఒకటేంటి ఎవరు చూసినా అమరావతి మంత్రమే జపిస్తున్నారు.

అమరావతి అనే పేరు తమ ప్రాంతీయకు, చరిత్ర కు చిహ్నంగా కొందరు భావిస్తుంటే. మరికొందరు అదో బిజినెస్ బ్రాండ్ గా భావిస్తున్నారు. అమరావతి పేరు తమకు కలిసొస్తోందని బిజినెస్ సర్కిల్స్ లో అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా షాపుకు రానివాళ్లు కూడా అమరావతి అనే పేరు చూసి ఆసక్తిగా ఇటువైపు చూస్తున్నారంటున్నారు.

మొత్తం మీద అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో.. ఇటు ప్రైవేట్ వర్గాలూ అంత కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. కలల రాజధానికి ఆమాత్రం సాయం చేయకపోతే.. ఎందుకన్నట్లు వ్యాపార వర్గాలు రెచ్చిపోతున్నాయి. ఏదో ఉడతా భక్తి సాయం అన్నట్లుగా అమరావతి బ్రాండింగ్ ను వినూత్నంగా చేస్తున్నాయి. గుంటూరు, విజయవాడ సిటీల్లోనే కాదు.. మచిలీపట్నం, నందిగామ లాంటి పట్టణాల్లో సైతం అమరావతి భజన తారాస్థాయిలో సాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు