అమెరికాలో మనవాళ్ల ఓటెవరికి..?

అమెరికాలో మనవాళ్ల ఓటెవరికి..?

అమెరికా ఎన్నికల్లో ఎన్నారైలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు మెజార్టీ ఓటర్లుగా ఉన్న వీరి ఓట్లను ప్రధాన అభ్యర్థులు ఎవ్వరూ విస్మరించే వీల్లేదు. అందుకే ఇండియన్ అమెరికన్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా యాడ్లు రూపొందుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇండియన్ ఓటర్ల కోసం భారతీయ నాయకుల నినాదాల్ని కూడా కాపీ కొట్టాల్సిన అగత్యం ఇప్పుడు అమెరికాలో ఏర్పడింది.

ముఖ్యంగా రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కాపీయింగ్ లో ముందంజలో ఉన్నారు. 2014లో అబ్  కీ బార్ మోడీ సర్కార్ అన్న నినాదాన్ని కాస్త మార్చి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని హోరెత్తిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఓ వర్గం భారతీయ అమెరికన్లకు రుచిస్తున్నాయి. పైగా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తారన్న భావన కూడా కలుగుతోంది.

అటు హిల్లరీ క్యాంప్ కూడా తక్కువ తినలేదు. భారతీయ అమెరికన్లకు ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. హిల్లరీ టీమ్ లో పాక్ అనుకూలురు ఉన్నారనే ప్రచారం ప్రత్యర్థులు చేస్తున్నా.. హిల్లరీ ఎక్కడా తగ్గడం లేదు. ఎక్కడికక్కడ భారతీయ అమెరికన్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే భర్త బిల్ క్లింటన్ పేరు వాడుతున్నారు.

సంప్రదాయంగా డెమోక్రాట్లకు మద్దతిస్తున్న భారతీయ అమెరికన్లు. ఈసారి ట్రంప్ కు ఓటేయొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో సర్వేలో హిల్లరీకే ఆధిక్యం వచ్చినా.. అప్పటితో పోలిస్తే ట్రంప్ కు మద్దతు పెరిగిందనే వాదన ఉంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు