మంత్రికి తక్కువ కమెడియన్‌కి ఎక్కువ

మంత్రికి తక్కువ కమెడియన్‌కి ఎక్కువ

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మాటల మాంత్రికుడు. మంత్రి టిజి వెంకటేష్‌ కూడా అంతే. ఇద్దరూ ఒకరిపై ఒకరు కామెంట్లు వేసుకుంటే, ఒకరికి ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అదే జరిగింది. టిఆర్‌ఎస్‌ నేతలతో సినిమా తీస్తానని టిజి వెంకటేష్‌ 'జోక్‌' పేల్చారు. జోకు కాదిది, టిఆర్‌ఎస్‌పై వెటకారమ్‌ పండించారు టిజి వెంకటేష్‌.

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఊరుకోలేదు. మంత్రి టిజి వెంకటేష్‌ కమెడియన్‌కి ఎక్కువ మంత్రికి తక్కువని ఎద్దేవా చేశారాయన. మంత్రి వర్గంలో జోకర్‌లు కూడా ఉంటారని టిజి వెంకటేష్‌ని చూశాకే తెలిసిందట హరీష్‌రావుకి. ఒక మాట అని నాలుగు మాటలు కాయడం అంటే ఇలాగే ఉంటది. టిఆర్‌ఎస్‌ని కెలకడం టిజి వెంకటేష్‌కి సరదా. ఆ సరదా తీర్చేయడం టిఆర్‌ఎస్‌కి మామూలే.

మంత్రి తన హుందాతనాన్ని మర్చిపోయి వెటకారాలు చేయడం మంచిది కాదు. అధికారుల బాధ్యతల గురించి మాట్లాడే మంత్రిగారు తను హుందాగా వ్యవహరించాలని గుర్తుంచుకుంటే మంచిది ఆయనకీ, అందరికీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు