జానారెడ్డిపై వేటు?

జానారెడ్డిపై వేటు?

కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ కూడా కీల‌క‌మైన స‌మ‌యాల్లో అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ సొంత పార్టీకి నష్టం కలిగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె.జానారెడ్డి తప్పులను ఇక పార్టీ భరించే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. జానా తీరుపై ఎప్పటినుంచో అసంతప్తి ఉన్నా కూడా ఆయన పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకుని లోలోన తిట్టుకోవడమే తప్ప అధిష్ఠానం వరకు తీసుకెళ్లిన సందర్భాలు తక్కువ. కానీ... ఇటీవల కాలంలో జానా జానతనం నానాటికీ ఎక్కువవతుండడంతో అధిష్ఠానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలన్న ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రీసీంటుగా ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా 50 వేల ఎక‌రాల‌కు నీరు తేవడంపై జానా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ప్రాజెక్టు వెనుక టీఆరెస్ ప్రభుత్వ కృష్టి ఉందని ఆయన మీడియా ఎదుట వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో మొద‌టి నుంచి జానాపై ఆగ్రహంగా ఉన్న వ‌ర్గం, జానాకు వ్యతిరేక వ‌ర్గం నేత‌లు ఆయ‌న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళ‌న‌ల‌తో ప్రజామ‌ద్దతు కూడ‌గ‌డుతుంటే.. మ‌రోవైపు ఆ ప్రయ‌త్నాల‌కు జానారెడ్డి తూట్లు పొడుస్తున్నార‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. టీఆరెస్ ప్రభుత్వాన్ని పొగడడం మానుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా జానా మారకపోవడంతో సీనియర్ నేతలు కొందరు సోనియమ్మ దృష్టికి సంగతంతా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జానాపై ఈసారి యాక్షన్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

జానాపై ఫిర్యాదులో ముఖ్యంగా మూడు అంశాలను పేర్కొంటున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నిక‌లకు ముందు రూ.5ల‌కే భోజ‌నం ప‌థ‌కం బాగుంద‌ని ప్రశంసించడం.. గ్యాంగ్ స్టర్ న‌యీంను ఎన్ కౌంటర్ చేసినందుకు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని అభినందించడం... ప్రాజెక్టుల రీడిజైనింగ్ విష‌యంలోనూ ప్రభుత్వానికే అనుకూలంగా మాట్లాడడం, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి రూపొందించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్‌కు గైర్హాజరుకావడం.. తాజాగా ఏఎమ్మార్పీ ప‌థ‌కం విష‌యంలో ప్రభుత్వాన్ని అభినందించడం వంటివి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English