తుపాకులతో సాధ్యం కానిది తల్లి ప్రేమకు సాధ్యమైంది

తుపాకులతో సాధ్యం కానిది తల్లి ప్రేమకు సాధ్యమైంది

తుపాకులతో సాధ్యం కానిది తల్లి ప్రేమకు సాధ్యమైంది. కశ్మీర్లో కరడుగట్టిన ఉగ్రవాదిని కూడా అమ్మ ప్రేమ కరిగించేసింది. గత మే నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి.. లష్కరే తోయిబాలో చేరిన కొడుకు.. తల్లి మాట కాదనలేక.. భద్రతాదళాలకు లొంగిపోయిన ఘటన.. సమాజంలో మిగిలి ఉన్న మాతృత్వపు విలువలకు అద్దం పట్టింది. కడుపుకోత మిగిల్చొద్దు.. సైన్యానికి లొంగిపో అని తల్లి చేసిన ఉపదేశం.. ఉగ్రవాది మనసు మార్చింది. తనంతట తానుగా లొంగిపోవడమే కాకుండా.. ఆయుధాలు కూడా అప్పగించాడు. పటాస్ మూవీలో చూపించిన ట్రిక్.. ఇక్కడ భద్రతాదళాలు వర్కవుట్ చేసినట్లు కనిపిస్తోంది.

కశ్మీర్ లోని బారాముల్లా జిల్లా సోపోర్ లో  ఉగ్రవాది నక్కాడన్న సమాచారంతో భద్రతాదళాలు అలెర్టయ్యాయి. సోదాల్లో ఓ ఇంట్లో దాక్కున్నట్లు గుర్తించి చుట్టుముట్టాయి. లొంగిపోమని చెప్పినా ఉగ్రవాది నుంచి రిప్లై లేదు. ఉమర్ ఖలిక్ మీర్ లష్కరే తోయిబాలో చేరి నెలలే అయింది. కాబట్టి కరడుగట్టిన ఉగ్రవాది కాదని గ్రహించిన సైన్యం.. దూరంగా ఉంటున్న తల్లిదండ్రులకు కబురు చేసింది. కొడుకు మనసు మార్చాలని సూచించింది. సైన్యం సూచన మేరకు.. తల్లి వచ్చి బతిమిలాడటంతో.. ఉమర్ ఖలీక్ మనసు మార్చుకుని.. సైన్యానికి లొంగిపోయాడు. కశ్మీర్లో ఈ భావోద్వేగ సంఘటన అందరి మనసుల్నీ కదలించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు