ఛేజ్ చేసి మరీ సెల్ఫీ పట్టేసింది

ఛేజ్ చేసి మరీ సెల్ఫీ పట్టేసింది

తాము అభిమానించే ఐడల్ ను కలుసుకోవడం ఏ అభిమానికైనా అమూల్యమైన సందర్భమే. స్ఫూర్తి ప్రదాతలు అనుకున్నవారిని కలిసిన ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇలాంటి సందర్భాన్ని అదృష్టంగా భావించి మురిసిపోతుంటారు ఫ్యాన్స్. రాంచీకి చెందిన ఓ కలేజ్ విద్యార్ధిని ఆరాధ్యకూ ఈ తరహా ఛాన్సే దక్కింది. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీనితో సెల్ఫీ దిగి తన స్నేహితులకు గర్వంగా చెప్పుకునే అవకాశం దక్కించుకుంది. ఫ్యాన్స్ తో ధోనీ సెల్ఫీలు దిగడం మామూలే కదా. దీంట్లో ఏమంత విశేషముంది? అని తీసిపారేయొద్దు. ఎందుకంటే, ఈ సెల్ఫీ కోసం ఆరాధ్య చాలా కష్టమే పడింది. సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్లిపోతున్న ధోనీ హమర్ వాహనాన్ని స్కూటీపై ఛేజ్ చేసి మరీ కెప్టెన్ కూల్ తో సెల్ఫీ దిగింది.

అక్టోబర్ 26న న్యూజిలాండ్ తో ఒన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ త లగ్జరీ హమర్ కార్ లో రాంచీ ఎయిర్ పోర్టుకు బయలుదేరాడు. ఇది చూసిన ఆరాధ్య తాను ఎంతగానో అభిమానించే ధోనీతో ఫొటో దిగాలని స్కూటీపైనే అతడి కార్ ను ఫాలో అయింది. వేగంగా దూసుకెళ్లిపోతున్న హమర్ ను అందుకోడానికి చాలా కష్టపడింది. చివరికి ధోనీ ఎయిర్ పోర్టుకు వచ్చేశాడు. టెర్మినల్ లో ప్రవేశించేందుకు రెడీ అయిపోతున్నాడు. దీంతో అతడితో ఫొటో దిగడం సాధ్యం కాదేమోనని ఆరాధ్య బాధపడిపోయింది. ఆవేదన, భయం కలగలసిన గొంతుతో ధోనీని గట్టిగా పిలిచింది. ఆమె ఆశ ఫలించింది. తనవైపు చూసిన ధోనీ వద్దకు పరుగుపరుగున వచ్చి ఒన్ ఫొటో ప్లీజ్ అంటూ ఓ సెల్ఫీ దిగింది. ఈ ఫోటో కోసం ఆరాధ్య తనను స్కూటీపై వెంటాడినట్లు తెలుసుకుని ధోనీ ఆశ్చర్యపోయాడట. ఆమె ఫ్రెండ్స్ కూడా ఈ ఛేజింగ్ సీన్ పై ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు