ప్రగతి రథ చక్రానికి అష్టకష్టాలు

ప్రగతి రథ చక్రానికి అష్టకష్టాలు

ఆర్టీసీ బస్సు చక్రాన్ని ప్రగతి రథ చక్రంగా చెబుతారు. ఏదైనా మారుమూల పల్లెకు ఆర్టీసీ బస్సు వేస్తే చాలు.. కొన్నాళ్ల తర్వాత ఆ గ్రామం రూపురేఖలే మారిపోతాయి. ఇది ఏదో గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. చాలా గ్రామాల ప్రజలు అనుభవపూర్వకంగా ఒప్పుకునే నిప్పు లాంటి నిజం. అలా చాలా గ్రామాల భాగ్యరేఖల్ని మార్చిన ఆర్టీసీ.. ఇప్పుడు తానే ఆపసోపోలు పడుతోంది. తెలంగాణ ఆర్టీసీకి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. కనీసం కార్మికులకు వేతనాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీపావళి సమయంలో బోనస్ ల సంగతి పక్కనపెడితే.. దసరా, దీపావళి రెండు పండుగల వచ్చిన అక్టోబర్ నెల జీతం ఇంతవరకూ కార్మికులకు అందలేదు.

యాజమాన్యం ఆర్థిక కష్టాలు సాకు చెబుతున్నా.. కార్మికులు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్లలో అసంతృప్తి పెరిగితే సామాన్య ప్రయాణికులే ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓ విడత వేతన సవరణ బకాయిలు బాకీపడ్డ ఆర్టీసీ.. ఇప్పుడు నెల జీతం కూడా ఇవ్వలేని స్థితికి చేరింది. శుక్ర, శని వారాల్లో జీతాలిస్తామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నా.. బకాయిల సంగతి మాత్రం చెప్పడం లేదు. గతంలో సీఎం కఆర్ ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ఎన్నో సంస్కరణళు ప్రతిపాదించారు. కానీ అవేవీ ఆర్టీసీని ఆదుకోవడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే తమ కష్టాలు గట్టెక్కుతాయని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు