జీతం హైక్ 100 శాతం

జీతం హైక్ 100 శాతం

"జీతంలో అందరికి పెంపు కావాలి కానీ దీనిపై ఎవరూ మాట్లాడరు" అని కొన్ని నెలల క్రితం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ పార్లమెంట్ లో వ్యక్తీకరించిన అభిప్రాయం ఇది. పార్లమెంటేరియన్ల వేతన పెంపుపై చర్చ సందర్భంగా ఆయన అన్న మాట అది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగానే నేతల జీతభత్యాల్లోనూ పెరుగుదల ఉండాలన్న డిమాండ్లపై కొద్ది కాలం క్రితం ప్రభుత్వం బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ, ఎంపీలంతా ఆశిస్తున్నట్లే వారి జీతాలను వంద శాతం పెంచాలని సూచిస్తూ ప్రధాని కార్యాలయానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.50వేల స్థానంలో ఎంపీలకు రూ.లక్ష అందించాలని రిపోర్టులో పేర్కొంది.

యోగి ఆదిత్యనాథ్ నివేదికపై పీఎంఓ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతా సజావుగా సాగిపోతే ఎంపీలంతా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ స్థాయిలో నెలకు రూ.లక్ష అందుకుంటారు. పార్లమెంటేరియన్ల జీతాలతో పాటూ వారి అలవెన్సులనూ సమీక్షించాలని ప్రధాని కార్యాలయం నిర్ణయించుకుందట. దీంతో మన నేతలకు బెనిఫిట్స్ మరింతగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఎంపీల సాలరీనే కాక రాష్ట్రపతి, గవర్నర్ జీతాలనూ పెంచే యోచనలో పీఎంఓ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి వేతనాన్ని రూ.1.5లక్షల నుంచి రూ.5లక్షలకు, గవర్నర్ సాలరీని రూ.1.10లక్షల నుంచి రూ. 2.5లక్షలకు హైక్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు.

వంద శాతం జీతాలను హైక్ చేయించుకుంటున్న ఎంపీలు తమ గురించీ కాస్త పట్టించుకుంటే బాగుంటుందని సాధారణ ఉద్యోగులు అంటున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం లేకపోవడం తమనూ ఇబ్బందులపాలు చేస్తోందన్నది వారి వాదన. ఇదిలా ఉంటే, ఎంపీల జీతభత్యాల పెంపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అందుకే సత్ప్రవర్తన కలిగిన నేతలకు తప్పనిసరిగా వేతనంలో పెంపు ఉండాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఎప్పుడో చెప్పారు. అయితే ఆయన సూచనతో విబేధిస్తూ పార్లమెంట్ సభ్యులందరీ జీతాలు ఒకే విధంగా ఉండాలని చాలామంది అభిప్రాయపడ్డారు. మెజార్టీ నేతల అభిప్రాయం విజయం దిశగా అడుగులేయండోతో నెల తిరిగేసరికల్లా ఎంపీల చేతిలో రూ.లక్ష పడిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు