గోవాలో కోహ్లీ అనుష్క..

గోవాలో కోహ్లీ అనుష్క..

టీమిండియా స్టార్ బ్సాట్స్ మన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. విశాఖపట్నంలో న్యూజిలాండ్ చివరి వన్డే మ్యాచ్ అయిపోగానే కోహ్లీ గోవా వెళ్లిన కోహ్లీ.. అనుష్కతో సరదాగా గడిపాడు. ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా ఎఫ్ సీ గోవా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షిస్తూ ఇద్దరూ ఉత్సాహంగా గడిపారు. ఎఫ్ సీ గోవా సహ యజమాని అయిన కోహ్లి టీమ్ జెర్సీలో మెరిశాడు. అనుష్క తెలుపు రంగు సల్వార్ సూట్ లో సింపుల్ గా ఉంది.

చాలా కాలం తర్వాత కోహ్లి-అనుష్క కలిసి బహిరంగంగా కనబడడంతో వీరిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఐఎస్ఎల్ మ్యాచ్ సందర్భంగా వీరితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. కోహ్లి, అనుష్క చిరునవ్వుతో ఫ్యాన్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చారు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-2తో గెలిచింది. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో విజయం సాధించి ధోనిసేన సిరీస్ దక్కించుకుంది. సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న కోహ్లీ.. అనుష్కతో కలిసి ఫుల్ గా ఖుషీ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English