ముద్ర‌గ‌డ‌కి కొత్త కౌంట‌ర్ రెడీ చేసిన టీడీపీ

ముద్ర‌గ‌డ‌కి కొత్త కౌంట‌ర్ రెడీ చేసిన టీడీపీ

కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌మ కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు దీనికి సంబంధించి హామీ కూడా ఇచ్చార‌ని, ఆ హామీనే నెర‌వార్చాల‌ని కోరుతున్నామ‌ని ముద్ర‌గ‌డ అంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా చేశారు. నిరాహార దీక్ష‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మంజునాథ క‌మిటీని ఏర్పాటు చేసింది. అయిన‌ప్ప‌టికీ ముద్ర‌గ‌డ శాంతించ‌లేదు. క‌మిటీల‌తో పొద్దుపుచ్చాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు ప్లాన్ వేస్తోంద‌ని, అది స‌రికాద‌ని అన్నారు.  

ఈ నేప‌థ్యంలోనే కాపు సామాజికి వ‌ర్గానికి చెందిన చిరంజీవి, దాస‌రి నారాయ‌ణ త‌దిత‌రుల‌ను క‌లిసి త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. అదేవిధంగా కాపుల‌ను మ‌రింత‌గా చైత‌న్య‌వంతం చేసేందుకు న‌వంబ‌రు 16 నుంచి ఐదు రోజుల పాటు స‌త్యాగ్ర‌హ‌ పాద‌యాత్ర‌ను చేప‌ట్ట‌నున్నారు. అయితే ఈ యాత్ర స‌క్సెస్ అయితే ప్ర‌భుత్వానికి తీవ్ర వ్య‌తిరేక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని టీడీపీ నేత‌లు గ్ర‌హించారు. దీనివ‌ల్ల ఈ రెండున్న‌రేళ్లో సంపాదించుకున్న క్రెడిట్‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ‌కి కౌంట‌ర్ ఇవ్వాల‌ని ప‌క్కా ప్లాన్ వేసిన‌ టీడీపీ అధినాయ‌క‌త్వం.. టీడీపీ సీనియ‌ర్ నేత, కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ రామానుజ‌య‌ను రంగంలోకి దింపుతోంది. ముద్ర‌గ‌డ తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తుంటే.. రామానుజ‌య క‌డ‌ప జిల్లా ఇడుపుల పాయ‌ నుంచినవంబ‌ర్ 16 నుంచి ఐదు రోజుల‌పాటు బ‌లిజ శంఖారావం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బాబు ప్ర‌భుత్వం కాపుల‌కు ఎంత సేవ చేస్తోందో.. ఎన్ని ప‌థ‌కాలు ప్రవేశ పెట్టిందో.. వంటి వివ‌రాలు వెల్ల‌డించనున్నారు.

ప‌నిలోప‌నిగా .. వైకాపా అధినేత జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీపై పెద్ద ఎత్తున విరుచుకుప‌డే అవ‌కాశం ఉంది. ఇడుపుల‌పాయ‌లో ఉన్న వైయ‌స్ స‌మాధికి ఓ విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు రామానుజ‌య సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. బ‌లిజ‌-కాపుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని అడ్డుపెట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్ కుట్ర చేస్తున్నార‌ని ఆ విన‌తి ప‌త్రంలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ముద్ర‌గ‌డ‌కి టీడీపీ.. బాగానే కౌంట‌ర్ ఇవ్వ‌నుంద‌న్న మాట‌. మ‌రి ఈ ప‌రిణామం దేనికి దారి తీస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English