అంబానీ పై లక్ష్మీదేవికి అంత దయ ఎందుకు?

అంబానీ పై లక్ష్మీదేవికి అంత దయ ఎందుకు?

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఒకానొక టైమ్ లో ఇండియా సినిమా అంతా అవాక్కయ్యే లెవల్లో సినిమాలు తీశారు. ముఖ్యంగా హారర్ మూవీస్ తీస్తే ఇలాగే తియ్యాలనే బెంచ్ మార్క్ సెట్ చేశారు. మాఫియా మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ అయ్యారు. లేటెస్ట్ గా రక్తచరిత్ర మూవీతో ఫ్యాక్షన్ లో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ మధ్య కాలంలో తనదైన మార్క్ మూవీస్ కు దూరమై.. ఆదరణ కోల్పోయిన వర్మ.. ట్విట్టర్లో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపై నోరు పారేసుకుంటూ ఫ్యాన్స్ నోళ్లలో నానుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బుద్ధి లేదన్నా.. మెగాస్టార్ ను విమర్శించినా అది వర్మకే చెల్లింది.

లేటెస్ట్ గా వర్మ చూపు ఇప్పుడు ఇండియా కుబేరుడు ముకేష్ పై పడింది. ఫోర్బ్స్ లిస్ట్ లో వరుసగా ముకేష్ నే అగ్రస్థానం వరిస్తున్న సమయంలో.. వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముకేష్ మీదే లక్ష్మీదేవి అంత దయ ఎందుకు చూపుతోందని వర్మ సందేహం వ్యక్తం చేశారు. ముకేష్ లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తున్నారా.. లేదంటే వారి మధ్య బయటకు చెప్పకూడని ఒప్పందం ఏదైనా ఉందా అని కాంట్రవర్సీ ట్వీట్ పోస్ట్ చేశారు. లక్ష్మీదేవిని కామెడీ చేయడంపై సంప్రదాయవాదులు వర్మపై విరుచుకుపడుతున్నారు. అయితే షరా మామూలుగా వర్మ ఇలాంటి విమర్శలు పట్టించుకోకుండా తనకు తోచిన రీతిలో ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు