టార్గెట్ ఆర్కే

టార్గెట్ ఆర్కే

ఏవోబీలో మూడురోజులుగా వరుస కాల్పులతో ఆ ప్రాంతమంతా మోతెక్కిపోతోంది. ఎప్పుడూలేనంత భారీగా మావోయిస్టులకు నష్టం వాటిల్లింది. ఎన్ కౌంటర్ ముగిశాక కూడా పోలీసులు ఇల్లిల్లూ గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఏవోబీలో ఏజెన్సీ ప్రాంతమంతా పోలీస్ వలయం మధ్యే ఉంది. మొన్నటి కాల్పుల్లో ఆర్కే, గాజర్ల రవి రక్షణ టీమ్ లో సభ్యులు చనిపోవడంతో.. వారిద్దరి భద్రతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజాసంఘాల నేతలు ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రకటించగా.. విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాత్రం ఆ వాదనలో నిజం లేదని కొట్టిపారేశారు.

కానీ పౌరహక్కుల సంఘాలు పోలీసుల మాటలు నమ్మడం లేదు. ఏవోబీ, మల్కనగిరి ఏరియా కమిటీ నేతలు కూడా ఆర్కే, గాజర్ల రవి క్షేమంగా అయితే లేరని స్పష్టం చేస్తున్నారు. ఇంతవరకూ మావోయిస్టు పార్టీకి ఆర్కే జాడపై ఎలాంటి సంకేతాల్లేవు. ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత వాళ్లకు ఇంతవరకూ ఆర్కే కనిపించలేదు. మరోవైపు పోలీసులు కూడా ఆర్కే కోసమే గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలాసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఆర్కేను.. ఈసారి వదలకూడదని గ్రేహౌండ్స్ డిసైడైంది. అందుకే ఏవోబీలో అటు పోలీసులు, ఇటు మావోయిస్టు సానుభూతిపరులు జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆర్కే జాడపై మరికొన్నిరోజులు సస్పెన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English