శ్రీనివాస్‌రెడ్డి సినిమాకు షాకింగ్ బిజినెస్‌

శ్రీనివాస్‌రెడ్డి సినిమాకు షాకింగ్ బిజినెస్‌

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా శ్రీనివాస్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. త‌న‌దైన టైమింగ్‌తో కామెడీ పండించే శ్రీనివాస్‌రెడ్డి పంచ్‌లు విస‌ర‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు. క‌మెడియ‌న్ నుంచి గీతాంజ‌లి సినిమాతో శ్రీనివాస్‌రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా మ‌రోసారి ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

శ్రీనివాస్‌రెడ్డి ప‌క్క‌న పూర్ణ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు శివరాజ్ కనుమూరి దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమాపై ముందుగా ఎవ్వ‌రికి అంచ‌నాలు లేక‌పోయినా టీజ‌ర్‌తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేసింది. ఈ సినిమా టీజ‌ర్ చూసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ టీజ‌ర్‌ను స్వ‌యంగా తానే రిలీజ్ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చారంటే టీజ‌ర్ ఎంత‌లా ఎట్రాక్ట్ చేసిందో అర్థ‌మ‌వుతోంది.

ఇక ఈ సినిమా టీజ‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌తో థియేట్రిక‌ల్ రైట్స్ టాప్ రేటుకు అమ్ముడైపోయాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడును తెలుగులో విడుదల చేసిన నిర్మాత నీలం కృష్ణా రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమా థియేట్రిక‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.

రూ.7 కోట్ల‌కు ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ సేల్ అయ్యాయి. ఓ క‌మెడియ‌న్‌గా ఉండి కేవ‌లం రెండో సినిమాతోనే శ్రీనివాస్‌రెడ్డి ఈ రేంజ్ మార్కెట్ అందుకోవ‌డం విశేషం.  న‌వంబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు