పాపం.. కారులోంచి గెంటేశారు

పాపం.. కారులోంచి గెంటేశారు

తెలంగాణ రాష్ట్ర సమితి నేత రఘునందన్‌ అందరికీ సుపరిచితుడే. తెలంగాణ రాష్ట్ర సమితి 'వాయిస్‌'గా రఘునందన్‌ గురించి చెప్పవచ్చును. విద్యాధికుడు, పైగా న్యాయవాది కావడంతో తెలంగాణ ఉద్యమ నినాదాన్ని, టిఆర్‌ఎస్‌ నుంచి బలంగా చాటి చెప్పగల వ్యక్తిగా రఘునందన్‌కి మంచి పేరుంది.

కాని ఆయన వసూళ్ళకు పాల్పడుతున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఆరోపిస్తూ టిఆర్‌ఎస్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసింది. మీడియా వర్గాలకు ఇది షాక్‌ ఇచ్చిన వార్త. ఎందుకంటే రఘునందన్‌ మీడియాలో ఎక్కువగా కనిపించేవారు. చాలా చర్చలలో టిఆర్‌ఎస్‌ తరఫున ఎక్కువగా కనిపించిన వ్యక్తి రఘునందనే. మెదక్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా రఘునందన్‌ పనిచేశాడంటేనే అతను ఎంత గట్టి నాయకుడో అర్థమవుతుంది.

అంత గట్టి నాయకుడిని టిఆర్‌ఎస్‌ ఎందుకు వదులుకున్నదో ఎవరికీ అర్థంకాని ప్రశ్నగా మిగిలింది. పార్టీ నుంచి బయటకు పంపేటప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ముద్ర వేసింది టిఆర్‌ఎస్‌. తన సస్పెన్షన్‌ గురించి ఇంకా తెలియదని, రేపు దానిపై స్పందిస్తానన్నారు రఘునందన్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు