పవన్ కొత్త సభ పేరేంటంటే..

పవన్ కొత్త సభ పేరేంటంటే..

గత నెలలో కాకినాడ వేదికగా ప్రత్యేక హోదాపై పోరాటం కోసం ఏర్పాటు చేసిన సభకు సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అని పేరు పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వచ్చే నెల పదో తారీఖున అనంతపురంలో నిర్వహించబోయే సభకు కూడా పేరు నిర్ణయించాడు. దీనికి 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ'గా పేరు పెట్టినట్లు జనసేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ఈ రోజు ప్రెస్ నోట్ ఇచ్చారు.

ఈ సభ జరిగే అనంతపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి 'తరిమెళ్ల నాగిరెడ్డి మైదానం" అని పేరు పెట్టారు. ఇక ఈ 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ" వేదికకు 'కల్లూరి సుబ్బారావు" పేరు నిర్ణయించినట్లు జనసేన ప్రకటించింది. నవంబరు 10 సాయంత్రం 4 గంటలకు సభ ఆరంభమవుతుందని.. ఇందుకోసం పవన్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

గత నెల కాకినాడ సభలో ప్రత్యేక హోదాపై గళమెత్తుతూ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై సుతిమెత్తగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత హోదా ప్రస్తావనే తేలేదు. మరి అనంతపురం సభలో ఏం మాట్లాడతాడో చూడాలి. పవన్ పోరాటం కేవలం మాటలకే పరిమితం అవుతోందన్న విమర్శల నేపథ్యంలో పవన్ ఈసారి కూడా కేవలం ప్రసంగాలకే పరిమితమవుతాడా.. లేక క్షేత్రస్థాయి పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తాడా అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు