జియోను ఏడిపించినందుకు రూ3,050 కోట్ల జరిమానా?

జియోను ఏడిపించినందుకు రూ3,050 కోట్ల జరిమానా?

దిగ్గజ టెలికాం ఆపరేటర్లకు షాకిస్తూ ట్రాయ్‌ సంచలన సిఫార్సు చేసింది. రిలయన్స్‌ జియోకు ఉద్దేశపూర్వకంగా ఇంటర్‌ కనెక్టివిటీని కల్పించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌పై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించాలని టెలికం శాఖకు సిఫార్సు చేసింది. లైసెన్సు కండీషన్లు, సేవల నాణ్యతా నిబంధనలను ఈ మూడు కంపెనీలు పాటించడం లేదని ట్రాయ్‌ పేర్కొంది. వీటి కారణంగా ఆర్‌జియోకు కేటాయించిన ఇంటర్‌ కనెక్ట్‌ పాయింట్ల వద్ద సమస్యలు ఏర్పడి కాల్స్‌ ఫెయిల్యూర్లు భారీగా జరగుతున్నాయని తెలిపింది. ఆర్‌జియోకు పోర్టులు కేటాయించేందుకు ఈ కంపెనీలు తిరస్కరించడం పోటీని పరిమితం చేయడమేనని, ఈ చర్య వినియోగదారులకు వ్యతిరేకమైనదని ట్రాయ్‌ విమర్శించింది.

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌కు ఒక్కొక్క కంపెనీకి 1,050 కోట్ల రూపాయల చొప్పున, ఐడియాకు 950 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. ఈ మూడు కంపెనీల లైసెన్సులు రద్దు చేయాలని కానీ వినియోగదారులకు ఏర్పడే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పని చేయడంలేదని తెలిపింది. తమ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌లో 75 శాతం కాల్స్‌ ఫెయిల్‌ అవుతున్నాయని, ఇందుకు ఈ కంపెనీలు తగినన్ని పోర్టులు కేటాయించకపోవడమే కారణమని ఆర్‌జియో చేసిన ఫిర్యాదుపై ట్రాయ్‌ విచారణ జరిపింది. మరోవైపు ట్రాయ్‌ సిఫార్సులపై వొడాఫోన్‌, ఐడియా, ఆర్‌జియో స్పందించలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English