అంచనాల్ని మించిపోతున్న శాతకర్ణి

అంచనాల్ని మించిపోతున్న శాతకర్ణి

మామూలుగా ఒక హీరోతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలనుకున్నపుడు.. ఆ హీరో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా ఎంత వసూళ్లు రాబట్టిందో చూసుకుని.. ఆ మొత్తం ఖర్చు చేయడానికి రెడీ అవుతాడు నిర్మాత. ఐతే నందమూరి బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ సాధించిన షేర్.. రూ.40 కోట్లే అయినా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీద రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైపోయాడు క్రిష్. అది పెద్ద సాహసం అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే మాత్రం క్రిష్ స్ట్రాటజిక్‌గానే అడుగులేశాడని అర్థమవుతోంది. విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉండగానే ఈ సినిమా బిజినెస్ చకచకా అయిపోతోంది. అది కూడా రికార్డు రేట్లకు.

ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నైజాం హక్కుల్ని దాదాపు రూ.15 కోట్లకు నితిన్ కొనేశాడు. సీడెడ్ రైట్స్ సాయి కొర్రపాటి రూ.9 కోట్లకు సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఓవర్సీస్ హక్కులు కూడా ఎప్పుడో అమ్మేశారు. తాజాగా ఈ సినిమా కృష్ణా, గుంటూరు జిల్లాల హక్కులు కూడా బాలయ్య కెరీర్లో హైయెస్ట్ ప్రైస్‌కు అమ్ముడయ్యాయి. కృష్ణా హక్కుల్ని బేకరీ ప్రసాద్ అనే డిస్ట్రిబ్యూటర్ రూ.3.6 కోట్లకు.. గుంటూరు హక్కుల్ని ‘ఎస్ పిక్చర్స్’ సంస్థ రూ.4.5 కోట్లకు సొంతం చేసుకున్నాయి. ఈ లెక్కన ఆంధ్రా మొత్తం హక్కులు రూ.20 కోట్లు దాటేలా ఉన్నాయి. మొత్తంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఈజీగా రూ.60 కోట్లకు చేరేలా ఉన్నాయి. ఇక శాటిలైట్.. ఇతర హక్కులు కలిపితే క్రిష్ పెట్టిన బడ్జెట్ వర్కవుట్ కావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు