లోకేష్ బాబూ.. ఇది నిజమేనా?

లోకేష్ బాబూ.. ఇది నిజమేనా?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు క్లాస్ పీకారట. వినడానికి ఆశ్చర్యంగా ఇది నిజ్జంగా నిజం. అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భావిస్తున్న బాబు.. లోకేష్ ను పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని కోరారట. అందుకే గతంలో లాగా అటు హైదరాబాద్, ఇటు గుంటూరు అంటూ రెండూ చూడకుండా.. పూర్తిగా గుంటూరులోనే అందుబాటులో ఉండాలని సూచించారట. లోకేష్ ముందు అపాయింట్ మెంట్ ఉంటేనే కలుస్తున్నారని, ఫోన్లో కూడా త్వరగా అందుబాటులోకి రావడం లేదని పార్టీ సీనియర్లు కూడా బాబు దృష్టికి తేవడంతో.. చంద్రబాబు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తాను గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలా కార్యకర్తలతో మమేకమయ్యారో.. ఇప్పుడు లోకేష్ కూడా అలా అందుబాటులో ఉండాలని బాబు కోరుకుంటున్నారట.

 ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిత్యం నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు. చివరకు ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబును కలిసేవారు. కానీ సీఎం అయ్యాక పరిస్థితి మారిపోయింది. పుట్టెడు కష్టాలతో ఉన్న రాష్ట్రాన్ని నిభాయించేసరికి బాబు తల ప్రాణం తోకకు వస్తోంది. దీనికి తోడు ముఖ్యమంత్రిగా చాలా బిజీ అయిపోయారు. గెస్ట్ లకు అపాయింట్ మెంట్స్ తర్వాత కుదిరితే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమయం కేటాయిస్తున్నారు. అదీ కొద్ది నిమిషాలు మాత్రమే. ఈ సమయంలో ద్వితీయ శ్రేణి నేతలకు బాబు దర్శనం దుర్లభమైపోయింది. వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని దూరం చేయడానికి, నాయకత్వంపై మరింత నమ్మకం పెంచడానికి లోకేష్ ను యాక్టివ్ చేయాలని బాబు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉంటున్న లోకేష్.. రోజూ గుంటూరు వెళ్లివస్తున్నారు. మొన్నే స్పాండిలైటిస్ కు చికిత్స చేయించుకున్న లోకేష్.. కాస్త కుదుటపడగానే మకాం గుంటూరుకే మార్చేస్తారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు