ఆర్మీ చేతికి చిక్కిన 44 మంది టెర్ర‌రిస్టులు

ఆర్మీ చేతికి చిక్కిన 44 మంది టెర్ర‌రిస్టులు

జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉరీ ప్రాంతంలో జ‌రిగిన ఉగ్ర ఘ‌ట‌న నేప‌థ్యంలో పాకిస్థాన్‌పై తీవ్ర‌స్థాయిలో ఫైరైన భార‌త్ ఆదేశానికి చుక్క‌లు చూపించింది. అప్ప‌టి నుంచి పాక్ ఉగ్ర మూలాల‌పై పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న భార‌త సైన్యం తాజాగా జ‌మ్ము కాశ్మీర్‌లోని ఉగ్ర‌వాదుల‌కు అనుకూలంగా మారుతున్నాయ‌ని భావిస్తున్న ప‌దికి పైగా ప్రాంతాల్లో స్థానిక పోలీసులతో క‌లిసి సోమ‌వారం రాత్రంగా ప్ర‌తి ఇంటినీ జ‌ల్లెడ ప‌ట్టారు. ఉత్తర కశ్మీర్ లోని బారాముల్లా పట్టణంలో ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున ప్ర‌తి ఇంట్లోకీ వెళ్లి వ్య‌క్తుల వివ‌రాలు స‌హా అన్ని విష‌యాల‌నూ అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేస‌మ‌యంలో కొన్ని ఇళ్ల‌లో త‌నిఖీలు చేసి.. పాకిస్థాన్, చైనా దేశాల జాతీయ‌ జెండాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

బారాముల్లా చరిత్రలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఆర్మీ, అధికారులు సోదాలు చేప‌ట్ట‌డం అంద‌రినీ ఉలిక్కి ప‌డేలా చేసింది. ఖ్వాజీ హమన, గనాయి హమన్, తవీద్ గంజ్, జామియా సహా 10 కీలకమైన ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ జల్లెడపట్టాయి. దాదాపు 700 ఇళ్లల్లో సోదాలు చేశామని, పెట్రోల్ బాంబులు, పాక్, చైనా జెండాలు స్వాధీనం చేసుకున్నామని, 44 మందిని అదుపులోకి తీసుకున్నామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి మనీశ్ కుమార్ చెప్పారు. అయితే, ఉగ్ర‌వాద అనుకూలురుగా మారిన‌ స్థానిక యువ‌త దాడుల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌న్న నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలోనే ఆర్మీ ఇంత పెద్ద యాక్ష‌న్ కు దిగింద‌ని తెలుస్తోంది.

ఇక‌, అదుపులోకి తీసుకున్న 44 మంది యువ‌త టెర్ర‌రిస్టులు అని చెబుతున్నా.. వారిని పూర్తిగా విచారించాక కానీ ఓ నిర్ధార‌ణ‌కు రాలేమ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఇదిలావుంటే, సోమ‌వారం నాటి ఆర్మీ చ‌ర్చ‌తో ఉగ్ర సంస్ఘ ల‌ష్క‌రే తాయిబా ఉలిక్కి ప‌డింది. ఇలాంటి వాటితో తాము ఆగేది లేద‌ని స్ప‌ష్టం చేస్తూనే భార‌త సైన్యం కాచుకోవాలంటూ ప‌రోక్ష హెచ్చ‌రిక‌ల‌కు దిగింది. దీంతో ఆర్మీ కూడా త‌గిన విధంగా రియాక్ట్ అయ్యేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి ప‌రిణామాల‌నైనా ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం సిద్ధంగా ఉంద‌ని అధికారులు ఇప్ప‌టికే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు