ఎవ్రీ ఫ్రైడే జ‌గ‌న్‌కు 33 సార్లు పిలుపు

ఎవ్రీ ఫ్రైడే జ‌గ‌న్‌కు 33 సార్లు పిలుపు

ఈ హెడ్డింగ్ చూసి ఏంటిది.. అనుకుంటున్నారా?  నిజ‌మేన‌ట‌! ఏపీ విపక్షం వైకాపా అధినేత జ‌గ‌న్‌కి ప్ర‌తి శుక్ర‌వారం కోర్టు వారం అని ఇటీవ‌ల వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన టీడీపీ నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ గురించిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెలుగులోకి తెచ్చారు. అదేంటంటే.. ఎవ్రీ ఫ్రైడే జ‌గ‌న్ కోర్టుకు హాజ‌రు కాగానే ఆయ‌న పేరును కోర్టు గుమాస్తా 33 సార్లు పిలుస్తున్నార‌ట‌. అలా 33 సార్లు పిలిపించుకునే నేత జ‌గ‌న్ ఒక్క‌రేన‌ని అంటున్నారు. ఈ విష‌యాన్ని టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ సోమ‌వారం ఢిల్లీలో వెల్ల‌డించారు. కోర్టులో త‌న‌ పేరును ఒకే రోజు ఇన్ని సార్లు పిలిపించుకోవ‌డం ఒక్క జ‌గ‌న్‌కే చెల్లింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ అవినీతి సంపాద‌న విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అవినీతి విష‌యంలో జ‌గ‌న్ మాట్లాడ‌డం ద‌య్యాలు వేదాలు వ‌ల్లించ‌డంలానే ఉంద‌ని ర‌మేష్‌ దుయ్య‌బ‌ట్టారు. జగన్ కు సంబంధించిన వేల కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసిందని చెప్పారు. హైదరాబాదు నుంచి ఒక వ్యక్తి పదివేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారనగానే అందరూ గతంలో ఇలాంటి నేరాలు చేసిన వారివైపు చూస్తారని.... ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎందుకు త‌న‌ను తాను ఊహించుకుంటున్నారో, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు త‌డుముకుంటున్నారో అర్ధం కావ‌డం లేద‌ని ర‌మేష్ అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టులో జగన్ పేరును 33 సార్లు పిలుస్తారని ఆయ‌న‌ చెప్పారు.

అవినీతికి కేరాఫ్‌గా మారిన జ‌గ‌న్‌.. నీతుల గురించి మాట్లాడ‌తారా? అని ప్ర‌శ్నించారు. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి అవినీతి గురించి జ‌గ‌న్ లేఖ రాయ‌డం అత్యంత హాస్యాస్ప‌ద‌మ‌ని ర‌మేష్ తెలిపారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ వ్యాఖ్య‌లు మంచివేన‌ని చెప్పారు. అవినీతి ప‌రుల‌ను పట్టించాల‌ని కోర‌డం మంచిదేక‌దా అని సీఎం ర‌మేష్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఏపీలో అవినీతికి ఎవ‌రు పాల్ప‌డ్డారో? ఎవ‌రు అవినీతి సొమ్ము సంపాదించారో?  దేశం మొత్తానికి తెలుసున‌ని ర‌మేష్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ర‌మేష్ వ్యాఖ్య‌ల్లో ఎవ్రీ ఫ్రైడే జ‌గ‌న్‌కు 33 సార్లు పిలుపు అనే కొత్త కోణం ఆస‌క్తిగా మారింది. మ‌రిదీనికి వైకాపా ఎలా కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English