బాబుకు స‌ర్వేల్లో బీ గ్రేడ్ వ‌చ్చింది

బాబుకు స‌ర్వేల్లో బీ గ్రేడ్ వ‌చ్చింది

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు? ప్ర‌జ‌ల‌తో వారు ఎలా ఇంట‌రాక్ట్ అవుతున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి భ‌విష్య‌త్తు ఏంటి?  వారు చేస్తున్న వ్య‌వ‌హారాలు ఏమిటి? వ‌ంటి అనేక విష‌యాల‌పై స‌ర్వే చేయించిన విష‌యం తెలిసిందే. ఆయా విష‌యాల‌ను ఇటీవ‌ల విజ‌య‌వాడ స‌మీపంలోని కేఎల్ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన పార్టీ స‌ద‌స్సు సంద‌ర్భంగా చివ‌రిరోజు ఆయా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు వారి ప‌నితీరుతో కూడిన లేఖ‌ల‌ను అందించారు. ఆ ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ ఆధారంగా వారికి గ్రేడ్‌లు కూడా కేటాయించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్రాబాబు ఒక్క ఎమ్మెల్యేలు, మంత్రుల‌కే గ్రేడ్‌లు కేటాయించేది, స‌ర్వేలు చేయించేది? ఆయ‌న కూడా ముఖ్య‌మంత్రే క‌దా? ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకోరా? అని డౌట్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

 అయితే, ఆయ‌న కూడా త‌న ప‌నితీరుప స‌ర్వే చేయించుకున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో ఆయ‌నకు కూడా గ్రేడ్ కేటాయించార‌ని ఎమ్మెల్యేలు, మంత్రులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే, బాబుకు ఈ స‌ర్వేల్లో బీ గ్రేడ్ వ‌చ్చింద‌ని

స‌మాచారం. అదేంటి రాష్ట్రానికి సీఎం, క్ష‌ణ తీరిక లేకుండా ఏదో ఒక ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంలోని పాల్గొంటూ ప‌నిరాక్ష‌సుడిగా పేరు తెచ్చుకున్నాయన‌కు బీ గ్రేడ్ ఏంట‌ని ప్ర‌శ్నిస్తే.. ప‌నిలో ప‌డి ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం కుప్పాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని అందుకే ఈ గ్రేడ్ వ‌చ్చింద‌న్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి చంద్ర‌బాబు వ‌రుస‌గా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నిక‌వుతున్నారు. అయితే, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో మాత్రం ఆయ‌న ఎక్క‌డా ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్న‌ది లేదు.

 అంతేకాకుండా, కుప్పం ప్ర‌జ‌లు త‌న‌ను క‌ల‌వాల‌ని అమ‌రావ‌తికి వ‌చ్చినా ఫ‌లితం క‌నిపించ‌డం లేద‌ట‌. దీంతో వారు ఉసూరు మంటున్నార‌ని, అందుకే స‌ర్వేలో చంద్ర‌బాబుకు బీ గ్రేడ్ ఇచ్చార‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిగా మారింది. ఇక‌, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేల విష‌యానికి వ‌చ్చే స‌రికి.. వారికి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్నీ పూస గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ట‌. దీంతో వారికిచ్చిన సీల్డు క‌వ‌ర్ల‌ను చూసుకున్న ఎమ్మెల్యేల‌కు దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయిందిట‌! ముందు సీల్డు క‌వ‌ర్లు అందుకున్న‌ప్పుడు .. ఆ ఏముంటుందిలే? అనుకున్నార‌ట అంద‌రూ. ఆ త‌ర్వాత క‌వ‌ర్ తెరిచి అందులోని ఏడు పేజీల నివేదిక‌, ఆ చివ‌ర్న గ్రేడ్ వంటివి చూసే స‌రికి క‌రెంటు షాక్ కొట్టిన కాకి మాదిరి అయిపోయార‌ట‌!

ఎమ్మెల్యే పేరు చెప్పి దందా చేస్తుంది ఎవరో... పార్టీలో ఉన్న గ్రూపులు... నియోజకవర్గ...మండల.. గ్రామస్థాయి సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే అంశాలను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించార‌ట‌. ఇక‌,  నియోజక వర్గాలలో సెటిల్‌మెంట్లు చేస్తున్న ఎమ్మెల్యేల గురించి కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారట‌. ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన పుత్రరత్నాలు.. బంధువులు చేస్తున్న దందాపై పేజీల చొప్పున వివ‌రించార‌ట‌. దీంతో ఎమ్మెల్యేల‌కు మ‌తి పోయింద‌ట‌! ఇక‌,  ఏ గ్రేడ్‌ వచ్చిన వారు బయటపడుతున్నారు కానీ బీ, సీ, డీ గ్రేడ్‌లు వచ్చిన వారు మాత్రం విష‌యం చెప్పేందుకు త‌ప్పించుకుంటున్నారు. మొత్తానికి ఎవ‌రికి ఎలాంటి గ్రేడ్ వ‌చ్చింద‌నేది ప‌క్క‌న‌పెడితే. సీఎం చంద్ర‌బాబుకి బీ గ్రేడ్ రావ‌డంపైనే అంద‌రూ చ‌ర్చించుకుంటున్నార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు