జ‌గ‌న్‌ను మించుతోన్న ప‌వ‌న్ దూకుడు

జ‌గ‌న్‌ను మించుతోన్న ప‌వ‌న్ దూకుడు

ఏపీ పాలిటిక్స్‌లో జ‌న‌సేనాని దూకుడు పెంచారా? ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శాంతి సామ‌ర‌స్య స్టైల్లోనే రియాక్ట్ అవుతూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారా? ఓ ర‌కంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయ నేత దొరికాడా ? ప‌వ‌న్‌తో త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారా? అంటే ఇలాంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. సాధార‌ణంగా ప్ర‌జ‌లు త‌మకు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ప్ర‌తి ప‌క్ష నేత‌ల‌ను ఆశ్ర‌యించ‌డం స‌హ‌జం. కానీ, ఏపీలో ప‌రిస్థితి దీనికి భిన్నంగా మారిపోయింది. ఇంకా పార్టీని పూర్తి స్థాయిలో విస్త‌రించ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు క్యూ క‌ట్టి త‌మ స‌మ‌స్య‌లను విన్న‌వించుకుంటున్నారు.

గ‌తం స‌హా తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైకాపా, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ సాధించ‌ని స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ ఎంతో తేలిక‌గా ప‌రిష్క‌రించారు. దీంతో ఇప్పుడు ఏపీలో దూకుడుగా పోతున్న ద‌మ్మున్న నేత‌గా ప‌వ‌న్ ప్ర‌తి ఒక్క‌రి నోళ్ల‌లోనూ నానుతున్నాడు. గ‌తంలో అమ‌రావ‌తి భూముల విష‌యంలో ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆందోళ‌న బాట ప‌ట్టిన రైతులు తొలిసారిగా త‌మ గోడును ప‌వ‌న్‌కు వివ‌రించ‌డంతో.. జ‌న‌సేనాని స్వ‌యంగా మంగ‌ళ‌గిరి వెళ్లి.. బాధిత రైతుల గ్రామాల్లో స‌భ పెట్టారు. అక్క‌డి నుంచి చంద్ర‌బాబు ప్రభుత్వానికి సుతిమెత్త‌ని హెచ్చ‌రిక‌లు చేశారు. భూములు బ‌ల‌వంతంగా తీసుకోవ‌డం మంచిది కాద‌ని, రైతులకు న‌ష్టం క‌లిగించ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌వ‌న్ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

ఇక‌, ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో కేంద్రం నిర్మిస్తున్న గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యంలోనూ బాధిత రైతు కుటుంబాలు శ‌నివారం హైద‌రాబాద్‌లో ప‌వన్‌ని క‌లిసి త‌మ స‌మ‌స్య‌ను వివ‌రించాయి. దీంతో చ‌లించిపోయిన ప‌వ‌న్‌..  న‌దుల విష‌యంలో అటు కేంద్ర‌, ఇటు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల విజ‌న్‌ను వివ‌రిస్తూనే.. సుతి మెత్త‌గా విమ‌ర్శించారు. రైతులు న‌ష్ట‌పోతున్న విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించాల‌ని సూచించారు. కేసులు పెట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఓ క‌మిటీని వేసి ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. దీంతో హుటాహుటిన స్పందించిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆదివారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా క‌లెక్ట‌రు, ఎస్పీ, కాలుష్య‌నియంత్ర‌ణ మండ‌లి స‌భ్యులు, ఆక్వా పార్క్ అధికారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌పై స్పందించారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో ప‌వ‌న్ దూకుడు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ ప్ర‌స్తుతం ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ నేత‌గా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఓ పెద్ద దిక్కు క‌నిపిస్తున్నాడ‌న్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ప‌వ‌న్ ఇలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ ముందుకు వెళుతుంటే ప‌వ‌న్ కి ఇంకా జ‌నాల్లో ఆద‌ర‌ణ పెర‌గ‌డంతోపాటు.. పొలిటిక‌ల్‌గా కూడా పెద్ద ఎత్తున మైలేజీ పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భుత్వంపైనా, చంద్ర‌బాబుపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారే త‌ప్ప ఎలాంటి స‌మ‌స్య‌నూ ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నార‌నే టాక్ వ‌స్తోంది. అంతేకాకుండా, వైకాపా నేత‌ల వ్య‌వ‌హారంపైనా ప్ర‌జ‌ల్లో పెత్త ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో రానున్న రోజుల్లో జ‌గ‌న్‌కు ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయ నేత‌గా ప‌వ‌న్ మార‌తాడ‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయిపోయాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English