జగన్కు తాజా షాక్ ఇది!

జగన్కు తాజా షాక్ ఇది!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు మరో షాక్ ఎదురైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఆ పార్టీకి గుడ్ చెప్పారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదవ్యాస్ మాట్లాడుతూ వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్పై వేదవ్యాస్ విమర్శలు చేశారు. సీనియర్ అయిన తనను జగన్ తీవ్రంగా అవమానపర్చారని ఆరోపించారు. ఇక వైసీపీలో ఇమడలేనని, తనకు గౌరవం ఇచ్చే పార్టీలో చేరుతానని వేదవ్యాస్ ప్రకటించారు. త్వరలోనే ఏ పార్టీ అనేది వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

అయితే వేదవ్యాస్ టీడీపీలో చేరడం ఖరారైపోయిందనే తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ రంగంలోకి దిగి ఈ ఆపరేషన్ పూర్తి చేశారని అంటున్నారు. బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడు కిషన్ తేజ్, నారా లోకేశ్ మంచి స్నేహితులు కావడంతో ఇటీవల వీరిద్దరు కలుసుకొని వేదవ్యాస్ పార్టీ మార్పుపై చర్చించుకున్నారట. పార్టీలోకి వస్తే.. వేదవ్యాస్కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని లోకేశ్ తన స్నేహితుడు కిషన్ తేజ్కు హామీ ఇవ్వడంతో వేదవ్యాస్ టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో తన అనుచరవర్గంతో వేదవ్యాస్ భేటీ కాగా పార్టీ మారేందుకే మెజారిటీ కార్యకర్తలు మొగ్గుచూపారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలో త్వరలో వేదవ్యాస్ టీడీపీలో చేరనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు