రోజా గారూ..పాలిటిక్స్ 'జబర్దస్త్' షో కాదు

రోజా గారూ..పాలిటిక్స్ 'జబర్దస్త్' షో కాదు

బుల్లితెర 'జబర్దస్త్'కు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. గురు-శుక్ర వారాల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం కోసం టీవీ వీక్షకులు పడిగాపులు కాస్తుంటారు. ఇక యూట్యూబ్‌ల్లోనూ 'జబర్దస్త్' ఎపిసోడ్స్‌కు మంచి ఆదరణే ఉంది. ఈ షోలో పార్టిసిపేంట్స్ ఏ టైప్ పద ప్రయోగాలు ఉపయోగిస్తారో అందరికీ తెలిసిందే. వారి డైలాగ్స్‌కు జడ్జిలుగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు పడీపడీ నవ్వడం జగద్వితం. ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి మేడమ్ బయటకు రాలేకపోతున్నారని కొందరి మీడియా మిత్రుల అభిప్రాయం. అందుకే ఆమె వాగ్ధాటిలో తరచూ 'జబర్దస్త్" టైపు డైలాగులు వినిపిస్తూ జనాల చెవుల తుప్పు వదిలిస్తున్నాయని అంటున్నారు.

అసెంబ్లీ బయటే కాకుండా లోపలా తనదైన విమర్శనాస్త్రాలతో విపక్ష నేత రోజా గతంలో చిక్కుల్లో పడ్డారు. తన వైఖరి, బాడీ లాంగ్వేజ్లతో ఆమె కొంతకాలం అసెంబ్లీ బహిష్కరణకు గురయ్యారు. ఈ వివాదం ఎన్ని మలుపులు, మెలికలు తిరిగిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే, రోజా తాజా ప్రెస్మీట్లో టీడీపీ నేత, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ''డిక్కీ బలిసిన కోడి" అంటూ అభివర్ణించి అందరినీ షాక్‌లోకి నెట్టారు. ఆమె నోటి వెంబడి వచ్చిన ఈ మాటకు అర్ధమేంటో అందరికీ తెలిసిందే. బాధ్యతాయుతమైన నేత నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి లో గ్రేడ్ కామెంట్స్ చేయడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ''డిక్కీ.." వ్యాఖ్యకు ముందు ఆమె లోకేష్‌ను ''సిమ్ కార్డు లేని సెల్‌ఫోన్''గా అభివర్ణించారు. ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు 'జబర్దస్త్' వేదికపై పాయింట్లు తెచ్చినా రాజకీయాల్లో మాత్రం పరువు పోగొడతాయని రోజా గుర్తిస్తే మంచిది. లేకుంటే ఇలాంటి ద్వందార్ధాలు జనాలకు ఏవగింపు పుట్టించడం ఖాయం. బ్రహ్మాస్ర్తమైన ఓటు భవిష్యత్‌లో మేడమ్‌ను టీవీ షోలకే పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు