ర‌ఘువీరాకు పార్టీ మారాల‌ని స‌ల‌హా

ర‌ఘువీరాకు పార్టీ మారాల‌ని స‌ల‌హా

సంచ‌లన వ్యాఖ్య‌ల‌తో హాట్ హాట్ వాతావ‌ర‌ణం క్రియేట్ చేసే తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ సోద‌రుల్లో ఒక‌రైన జేసీ ప్ర‌భాక‌ర‌రెడ్డి.. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరాకు ఓ ఉచిత స‌ల‌హా ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉంటే ప‌ద‌వులు రావ‌ని, ఇప్ప‌టికైనా పార్టీ మారాల‌ని సూచించారు. ర‌ఘువీరా సీనియ‌ర్ పొలిటీష‌య‌న్ అంటూనే ప్రభాక‌ర రెడ్డి చుర‌క‌లు అంటించారు. ముఖ్యంగా ర‌ఘువీరా చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై సెటైర్ల‌తో విరుచుకుప‌డ్డారు.

అనంత‌పురం జిల్లాలో ర‌ఘువీరాకు ఎక్క‌డా నియోజ‌క‌వ‌ర్గం లేద‌ని, అందుకే ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ ఒక‌టుందా? అని అనుకుంటున్నార‌ని, దానిని పూర్తిగా మ‌రిచిపోయార‌ని, ఉనికి కాపాడుకునేందుకే ర‌ఘువీరా పాద‌యాత్ర‌లు చేస్తున్నార‌ని త‌న ఓన్ స్టైల్‌లో విరుచుకుప‌డ్డారు ప్ర‌భాక‌ర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో ఉంటే పదవులు రావని, తప్పనిసరిగా పార్టీ మారితేనే రాజకీయాలలో ఉంటారని ఆయన రఘువీరాకు సూచించారు.

ఇక‌, ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ.. హోదా విష‌యంలో చంద్ర‌బాబు మూడు నెల‌ల‌లోగా త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల‌ని సూచించారు. ఇప్ప‌టికే అన్ని పార్టీలూ ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డుతున్నాయ‌ని ప్ర‌భాక‌ర్‌రెడ్డి అన్నారు. మొత్తానికి ర‌ఘువీరా విష‌యంలో ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్య‌లు ఆస‌క్తి ఉన్నాయ‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అంటున్నారు. అయితే, ర‌ఘువీరా ఈ కామెంట్ల‌పై ఏమంటారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు