అంతా బాగుంటే.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకుందబ్బా..

అంతా బాగుంటే.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకుందబ్బా..

సింగుగారు స్పందించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ టంగ్ స్లిప్ అయినట్లున్నారు. అమ్మ చెప్పినట్లుంది.. ‘‘ఏంటి సింగ్ సాబ్.. మేనేజ్ చేయటంలో మీ తర్వాత ఈ దేశంలో అనుకుంటే.. మీరు కూడా అలా ఏమోషనల్ అయిపోతే ఎలా. అలా నిజాలు చెప్పేస్తారా ఏంటి? దేశం మొత్తం తగలబడిపోతున్నా.. మీరు కూల్ గా ఉండాలి. ఏం జరగనట్లే వ్యవహరించాలి. అంతే తప్ప.. విపక్షాలు గోల చేస్తే అలా రెస్పాండ్ అవ్వటమేనా? మీ కెరీర్ రికార్డు బుక్ లో ఒక బ్లాక్ మార్క్ వేయించుకున్నారు. దిస్ ఈజ్ టూ మచ్. మరోసారి మీకు అవకాశం ఇవ్వాలనుకుంటే విధేయత మార్క్ షీట్ బాగా పూర్ గా ఉంది ఇంప్రువ్ చేసుకుంటారో.. లేక ఇలానే ఉంటారో అని’’ హాట్ లైన్లో దిశానిర్దేశం చేసినట్లుంది. మౌన ప్రధాని తన మౌనవ్రతానికి కాసేపు భంగం వాటిల్ల చేసుకొని మరీ రాజ్యసభలో సమధానం చెప్పారు. రూపాయి పతనం గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నారు. పరిస్థితి అంతా బాగుందన్న భరోసాతో పాటు.. డాలర్ తో రూపాయి మారకం మళ్లీ పెరుగుతుందని చెప్పొకొచ్చారు.

రూపాయి పతనం పాపం అంతా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్త బలపడటం వల్లనేనని చెప్పుకొచ్చారు. మన రూపాయి బలపడాలంటే.. అమెరికా నాశనం అయిపోవాలన్న కామన్ మ్యాన్ కి రాకూడదేమో. ఇంకా ఆయన చాలా సానుకూల దృక్ఫదంతో మాట్లాడారు. రూపాయి విలువ పడిపోవటంలో కీలక భూమిక పోషించే ద్రవ్యలోటును 70మిలియన్ డాలర్లకు పరిమితం చేస్తామని ప్రకటించారు. అన్నీ బాగానే ఉన్నాయి సింగ్ సాబ్. మాదో బుల్లి డౌట్. మీరంతే మాకెంతో గౌరవం. అంతపెద్ద సోనియమ్మనే ఇంప్రెస్ చేశారంటేనే మీ టాలెంట్ మాకు అర్థమవుతుంది.  మరి అన్నీ బాగుంటే.. మీరన్నట్లు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న దానికి అర్థమేంటి సార్?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు